ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకున్న సంఘటనతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. కుండపోత వర్షాలకు అదుపు తప్పి పొంగిపొర్లుతున్న చెరువులో చిక్కుకుపోయిన మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్నారు. చివరికి అందరూ సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారందరూ ప్రాణాలతో ఉన్నారని అధికారులు వెల్లడించడంతో ప్రజలు, బాధిత కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి.

ఖమ్మం జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువు ఉప్పొంగి ప్రవహించింది. ఈ క్రమంలో చెరువు మధ్యలో కొందరు మత్స్యకారులు చిక్కుకుపోయారనే సమాచారంతో, వారిని రక్షించేందుకు SDRFకి చెందిన 10 మంది రెస్క్యూ సిబ్బంది, ఒక స్థానిక వ్యక్తి కలసి బరిలోకి దిగారు.
వారు ప్రయాణిస్తున్న సేఫ్టీ రెస్క్యూ బోట్లు ప్రమాదవశాత్తూ చెరువులోని ప్రవాహ హోరుకు బోల్తా పడ్డాయి. దీంతో బోట్లలో ఉన్న సిబ్బంది, స్థానికుడు ఒక్కసారిగా నీటి ఉధృతిలో కొట్టుకుపోయారు. బోట్లు బోల్తా పడటంతో బుధవారం రాత్రి నుంచి తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. చీకటి, నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలిగింది.
కొట్టుకుపోయిన వారిలో ఐదుగురు SDRF సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, మరో ముగ్గురు సురక్షితంగా ఉన్నారనే సమాచారం అధికారులకు అందింది. మిగిలిన ముగ్గురు సిబ్బంది జాడ తెలియకపోవడంతో రాత్రంతా అధికారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
ఎట్టకేలకు గురువారం ఉదయం గల్లంతైన ఆ ముగ్గురు సిబ్బంది కూడా క్షేమంగానే ఉన్నట్లు అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు. గల్లంతైన సిబ్బంది అందరూ చెరువులోని సురక్షిత ప్రాంతాల్లో ఉండటంతో వారిని ఒడ్డుకు తీసుకురావడానికి అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. ప్రత్యేక బోట్లు, అదనపు సిబ్బంది సాయంతో వారందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చే ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది.
మురసు తుపానుత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం భారీ వర్షాలు పడ్డాయి. 15వేలకు పైగా ఎకరాల్లో పంట నీట మునిగిందని అంచనా. వరి, పత్తి, మెుక్కజొన్న, మిరప పంటలు నీట మునిగాయి. మరోవైపు ఏజెన్సీలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. అత్యధిక వర్షాలు నమోదు అయ్యాయి. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అశ్వారావుపేటలో అత్యధికంగా 25.3 సెంటిమీటర్లు, దమ్మపేట మండలం మల్కారంలో 18.7, అంకంపాలెంలో 14.8, ములకపల్లిలో 14.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
{{/usCountry}}మురసు తుపానుత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం భారీ వర్షాలు పడ్డాయి. 15వేలకు పైగా ఎకరాల్లో పంట నీట మునిగిందని అంచనా. వరి, పత్తి, మెుక్కజొన్న, మిరప పంటలు నీట మునిగాయి. మరోవైపు ఏజెన్సీలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. అత్యధిక వర్షాలు నమోదు అయ్యాయి. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అశ్వారావుపేటలో అత్యధికంగా 25.3 సెంటిమీటర్లు, దమ్మపేట మండలం మల్కారంలో 18.7, అంకంపాలెంలో 14.8, ములకపల్లిలో 14.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
{{/usCountry}}వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు రింగ్ బండ్ కొట్టుకుపోయింది. దీంతో వందల ఎకరాలు నీట మునిగాయి. పాల్వంచ ప్రధాన రహదారిపైకి నీరు వచ్చి చేరింది. అనేక ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి.