ఖమ్మంలో మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లి 11 మంది రెస్క్యూ సిబ్బంది గల్లంతు
ఖమ్మంలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన 11 మంది అధికారులు గల్లంతు అయ్యారు.
ఖమ్మం జిల్లాలో వరద నీటిలో చిక్కుకుపోయిన మత్స్యకారుల ప్రాణాలను కాపాడేందుకు వెళ్లిన రక్షణ సిబ్బంది ఊహించని ప్రమాదంలో పడ్డారు. సహాయక చర్యలు చేస్తుండగా.. రెండు బోట్లు పల్టీ కొట్టాయి. దీంతో 11 మంది ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది గల్లంతయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పరిధిలోని బేతుపల్లి పెద్ద చెరువు వద్ద జరిగింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాల కురుస్తున్నాయి. మరోవైపు బేతుపల్లి పెద్ద చెరువులోకి వరద నీరు భారీగా ప్రవాహించింది. ఈ క్రమంలో అలుగు పారడంతో చెరువులోని చేపలు కొట్టుకుపోకుండా నిరోధించేందుకు ఐదుగురు జాలర్లు చెరువు వద్దకు వెళ్లి వలలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. వర్షపు నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఐదుగురు మత్స్యకారులు వరద నీటి సుడిగుండంలో చిక్కుకుపోయారు.
మత్స్యకారులు చిక్కుకున్న సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించారు. మొదట ముగ్గురు ఫైర్ సిబ్బంది బోటులో చెరువులోకి వెళ్లగా, సాంకేతిక లోపం, వరద ఉద్ధృతి కారణంగా ఆ బోటు సమస్యల్లో చిక్కుకుని వారు కూడా అక్కడే ఉండిపోయారు.
పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు కొత్తగూడెం నుంచి ఎస్డీఆర్ఎఫ్కు చెందిన ఆరుగురు సిబ్బందిని, మరో నలుగురు ఫైర్ సిబ్బందిని రప్పించి రెండు ప్రత్యేక బోట్లలో చెరువులోకి పంపించారు. ఈ బృందం మొదట చిక్కుకున్న ముగ్గురు ఫైర్ సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. అనంతరం మిగిలిన ఐదుగురు మత్స్యకారులను కాపాడేందుకు మళ్లీ చెరువులోకి వెళ్లింది.
చెరువు అలుగు వద్ద నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో అదుపుతప్పిన రెండు బోట్లు నీటిలో పల్టీలు కొట్టాయి. దీంతో బోట్లలో ఉన్న 11 మంది రెస్క్యూ సిబ్బంది నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. సహాయక చర్యలకు వెళ్లిన సిబ్బందే గల్లంతు కావడంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఘటన స్థలానికి వచ్చేసింది. విషయం తెలిసిన వెంటనే ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా భద్రాచలం నుంచి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం అత్యవసర బృందాలను రప్పించారు. నీటిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు, వారికి వెంటనే ఆసరా అందించేందుకు డ్రోన్ల సహాయంతో లైఫ్ జాకెట్లను చెరువులోని ప్రభావిత ప్రాంతాలకు చేరవేసే ఏర్పాట్లు చేస్తున్నారు. లైటింగ్ పరికరాలు, నిపుణులైన ఈతగాళ్లతో నీటిలో గల్లంతైన సిబ్బంది, మత్స్యకారుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటుగా పరిసర ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. మంగళవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమై జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల ధాటికి రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


