తెలంగాణ క్రీడారంగానికి భారీ ప్రోత్సాహం లభించింది. ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించింది. డిసెంబర్ 2026లో ఈ మెగా క్రీడోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలను పోటీలకు వేదికలుగా ఎంపిక చేశారు.

ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపు 6,000 మందికి పైగా యువ అథ్లెట్లు పాల్గొననున్నారు. మొత్తం 25 రకాల క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. వీటితో పాటు ఒక స్థానిక సంప్రదాయ క్రీడను ప్రతిపాదించే అవకాశాన్ని తెలంగాణకు కల్పించారు. అలాగే మరో కొత్త క్రీడా విభాగాన్ని కూడా ఈ ఎడిషన్‌లో కొత్తగా పరిచయం చేయనున్నారు.
ఈ క్రీడల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 21.17 కోట్ల నిధులను మంజూరు చేసింది. కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ(SAI), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ క్రీడా సమైక్యాలు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సీబీఎస్ఈ, ఖేలో ఇండియా స్టీరింగ్ కమిటీలు ఉమ్మడిగా ఈ పోటీలను పర్యవేక్షించి నిర్వహించనున్నాయి.
తెలంగాణకు ఈ మెగా ఈవెంట్ కేటాయించడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారతీయ యువతలో అపారమైన క్రీడా నైపుణ్యం ఉందని, అయితే గత ప్రభుత్వాలు క్రీడా మౌలిక వసతులు, ప్రతిభను గుర్తించడంలో నిర్లక్ష్యం వహించాయని విమర్శించారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే క్రీడా బడ్జెట్ గణనీయంగా పెరిగిందని, ఖేలో ఇండియా ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రతిభ వెలుగులోకి వస్తోందని గుర్తుచేశారు.
ఖేలో ఇండియా పథకం కింద తెలంగాణలో ఇప్పటికే దాదాపు రూ. 30 కోట్ల విలువైన క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో రూ. 11.5 కోట్ల వ్యయంతో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్, సింథటిక్ టెన్నిస్ కోర్టులు, మహిళల కోసం ప్రత్యేక ఈత కొలనును నిర్మించారు. రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో మిగిలిన రూ. 18.5 కోట్లతో మైదానాలు, అకాడమీలను అప్డేట్ చేశారు.
{{/usCountry}}ఖేలో ఇండియా పథకం కింద తెలంగాణలో ఇప్పటికే దాదాపు రూ. 30 కోట్ల విలువైన క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో రూ. 11.5 కోట్ల వ్యయంతో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్, సింథటిక్ టెన్నిస్ కోర్టులు, మహిళల కోసం ప్రత్యేక ఈత కొలనును నిర్మించారు. రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో మిగిలిన రూ. 18.5 కోట్లతో మైదానాలు, అకాడమీలను అప్డేట్ చేశారు.
{{/usCountry}}డిసెంబర్ 2026లో జరగబోయే ఈ పోటీలు తెలంగాణలోని వర్ధమాన క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి అనుభవాన్ని అందించడమే కాకుండా, రాష్ట్రంలో క్రీడా పర్యాటకాన్ని పెంచేందుకు ఎంతగానో దోహదపడనున్నాయి. ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలు మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభను వెలికితీసి ఉపయోగపడనుంది.