డిసెంబర్‌లో తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్.. నాలుగు జిల్లాల్లో పోటీలు!
Khelo India Youth Games 2026 : డిసెంబర్ 2026లో తెలంగాణలో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించడానికి కేంద్రం అంగీకరించింది. రాష్ట్రంలోని ముఖ్యమైన నాలుగు నగరాల్లో ఈ గేమ్స్ జరగనున్నాయి.
తెలంగాణ క్రీడారంగానికి భారీ ప్రోత్సాహం లభించింది. ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించింది. డిసెంబర్ 2026లో ఈ మెగా క్రీడోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలను పోటీలకు వేదికలుగా ఎంపిక చేశారు.

ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపు 6,000 మందికి పైగా యువ అథ్లెట్లు పాల్గొననున్నారు. మొత్తం 25 రకాల క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. వీటితో పాటు ఒక స్థానిక సంప్రదాయ క్రీడను ప్రతిపాదించే అవకాశాన్ని తెలంగాణకు కల్పించారు. అలాగే మరో కొత్త క్రీడా విభాగాన్ని కూడా ఈ ఎడిషన్‌లో కొత్తగా పరిచయం చేయనున్నారు.
ఈ క్రీడల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 21.17 కోట్ల నిధులను మంజూరు చేసింది. కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ(SAI), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ క్రీడా సమైక్యాలు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సీబీఎస్ఈ, ఖేలో ఇండియా స్టీరింగ్ కమిటీలు ఉమ్మడిగా ఈ పోటీలను పర్యవేక్షించి నిర్వహించనున్నాయి.
తెలంగాణకు ఈ మెగా ఈవెంట్ కేటాయించడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారతీయ యువతలో అపారమైన క్రీడా నైపుణ్యం ఉందని, అయితే గత ప్రభుత్వాలు క్రీడా మౌలిక వసతులు, ప్రతిభను గుర్తించడంలో నిర్లక్ష్యం వహించాయని విమర్శించారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే క్రీడా బడ్జెట్ గణనీయంగా పెరిగిందని, ఖేలో ఇండియా ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రతిభ వెలుగులోకి వస్తోందని గుర్తుచేశారు.
ఖేలో ఇండియా పథకం కింద తెలంగాణలో ఇప్పటికే దాదాపు రూ. 30 కోట్ల విలువైన క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో రూ. 11.5 కోట్ల వ్యయంతో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్, సింథటిక్ టెన్నిస్ కోర్టులు, మహిళల కోసం ప్రత్యేక ఈత కొలనును నిర్మించారు. రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో మిగిలిన రూ. 18.5 కోట్లతో మైదానాలు, అకాడమీలను అప్డేట్ చేశారు.
డిసెంబర్ 2026లో జరగబోయే ఈ పోటీలు తెలంగాణలోని వర్ధమాన క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి అనుభవాన్ని అందించడమే కాకుండా, రాష్ట్రంలో క్రీడా పర్యాటకాన్ని పెంచేందుకు ఎంతగానో దోహదపడనున్నాయి. ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలు మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభను వెలికితీసి ఉపయోగపడనుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


