జీహెచ్ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్) పునర్విభజనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ను ఏర్పాటు చేసింది. ఇటీవలనే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గురించి ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ - ముఖ్యమైన వివరాలు:
- గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను వేరు చేసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ)ని ఏర్పాటు చేశారు.
- జీహెచ్‌ఎంసీ చట్టం-1955, సెక్షన్-3(1) ప్రకారం సీఎంసీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
- హైదరాబాద్ లోని హైటెక్స్‌లో సీఎంసీ ఆఫీసును అందుబాటులోకి తీసుకువచ్చారు.
- సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఐఏఎస్ శ్రీజన బాధ్యతలు చూస్తున్నారు.
- కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లను కలిపి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా రూపొందించారు.
- కూకట్ పల్లి జోన్ లో 4 సర్కిళ్లు ఉంటాయి. వీటిలో మాదాపూర్, అల్వీన్ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట్ ఉన్నాయి.
- శేరిలింగంపల్లి జోన్ లో 5 సర్కిళ్లు ఉన్నాయి. వీటిలో నార్సింగి, పటాన్ చెరు, అమీన్ పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి ఉన్నాయి.
- కుత్బుల్లాపూర్ జోన్ లో 7 సర్కిళ్లు ఉన్నాయి. ఇందులో చింతల్, జీడిమెట్ల, కొంపల్లి, గాజులరామారం, నిజాంపేట, దుండిగల్, మేడ్చల్ ను భాగం చేశారు.
- సైబరాబాద్ కార్పొరేషన్ లో మొత్తం 3 జోన్లు ఉండగా... 16 సర్కిళ్లు ఉన్నాయి. వీటిల్లో కలిపి 76 వార్డులు ఉంటాయి.
- ఈ కార్పొరేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ సర్కిల్ లోనే అత్యధికంగా 27 వార్డులున్నాయి. ఆ తర్వాత శేరిలింగంపల్లిలో 26, కూకట్ పల్లి జోన్ లో 23 వార్డులను ఉంచారు.
- సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారిగా సీనియర్ ఐఎఎస్ జయేష్ రంజన్ బాధ్యతలు చేపట్టారు.
- ఐటీ, అభివృద్ధి చెందిన పట్టణ ప్రాంతాల పరిపాలనను మరింత సమగ్రంగా నిర్వహించేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.
- నగర విస్తరణ, జనాభా పెరుగుదల మరియు పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హైదరాబాద్ నగరాభివృద్ధికి దోహదపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

{{^htLoading}} {{/htLoading}}
ఇక ప్రస్తుత జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ యథావిధిగా కొనసాగుతోంది. కొత్తగా సైబరాబాద్ తో పాటు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజిగిరి జోన్లను కలిపి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశారు.సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లతో జీహెచ్ఎంసీ కొనసాగనుంది.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}