Hyderabad : ఇక 3 కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ - ఉత్తర్వులు జారీ, జోన్ల వివరాలివే

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ విభజనపై ఉత్తర్వలు జారీ అయ్యాయి. జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంఎంసీ)గా విభజించారు.

Published on: Feb 11, 2026 8:40 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీతో పాటు మల్కాజ్‌గిరి, సైబరాబాద్ లను కార్పొరేషన్లుగా ఏర్పాటయ్యాయి.

గ్రేటర్ హైదరాబాద్ విభజన (image source @ddyadagirinews)
గ్రేటర్ హైదరాబాద్ విభజన (image source @ddyadagirinews)

కమిషనర్ల నియామకం…

ఉత్తర్వలు జారీ కావటమే కాకుండా ఈ మూడు కార్పొరేషన్లకు ప్రభుత్వం కొత్త కమిషనర్లను కూడా నియమించింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ను యథాతథంగా కొనసాగించింది. సీఎంసీకి(సైబరాబాద్ కార్పొరేషన్) శ్రీజన, ఎంఎంసీకి(మల్కాజ్‌గిరి కార్పొరేషన్) వినయ్‌ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమించారు. ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించిన జయశ్ రంజన్ ను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

1) గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.(GHMC) - ఆర్వీ కర్ణన్‌, కమిషనర్

2) సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) - శ్రీజన, కమిషనర్

3) మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ ల ఏర్పాటు (MMC) - వినయ్‌ కృష్ణారెడ్డి, కమిషనర్

ఏ జోన్ ఎక్కడంటే..?

  • సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు ఉన్నాయి.
  • మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ లో మల్కాజ్ గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ జోన్లు ఉన్నాయి.
  • గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కోండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లు ఉన్నాయి.

గతంలో 150 డివిజన్లుగా ఉన్న పాత జీహెచ్ఎంసీ పరిధి విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు చేస్తూ వచ్చింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయటంతో పాటు ప్రజల నుంచి అభ్యంతరాలను కూడా స్వీకరించింది. ఈ ప్రక్రియంతా కూడా పూర్తి కావటంతో తాజాగా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా మూడు కార్పొరేషన్ల ద్వారా నగర ప్రజలకు సేవలందనున్నాయి.

పాత జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా 243 డివిజన్లకు పెంచారు. వీటికి అదనంగా విలీన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో మరో 57 డివిజన్లను ఏర్పాటు చేశారు. మొత్తంగా 300 డివిజన్లతో కూడిన నగర పాలక వ్యవస్థ... ఇప్పుడు మూడు విభాగాలుగా విభజించారు. ఈ కొత్త వ్యవస్థలో 60 సర్కిళ్లు, 12 జోన్లు ఉంటాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More