సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైన రైలు సౌకర్యం, అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటు లభిస్తుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. కొత్తగా నిర్మించిన కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీలు లక్ష్మణ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎం. రఘునందన్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పలువురు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కొమురవెల్లి ఆలయ నిర్మాణ శైలి, ఆధ్యాత్మిక వైభవం ప్రతిబింబించేలా ఈ స్టేషన్‌ను రూ. 6 కోట్ల వ్యయంతో నిర్మించారు. మొదట అనుకున్న రైల్వే ప్రతిపాదనల్లో ఈ స్టేషన్ లేనప్పటికీ, స్వామివారిని దర్శించుకునే భక్తుల రద్దీ, విన్నపాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా నిర్మించారు.
సికింద్రాబాద్ - సిద్దిపేట మధ్య నడిచే డెమూ రైళ్లు ఇకపై కొమురవెల్లి స్టేషన్‌లో కూడా ఆగుతాయి.
ఇవి అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు కావడం వల్ల ప్రయాణ ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి.
భక్తులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ఈ చవకైన రైలు ప్రయాణం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ రైల్వే హాల్ట్ వల్ల ఆధ్యాత్మిక పర్యాటకం పెరగడంతో పాటు స్థానిక వ్యాపారాలకు మంచి ఊతం లభిస్తుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు పురోగతిని వివరిస్తూ, మనోహరాబాద్ - సిద్దిపేట మధ్య 76 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ పూర్తయిందని, కరీంనగర్ వైపు రైలు అనుసంధానం ఏర్పడిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన అన్నారు:
ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 47,984 కోట్ల విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 2,000 కోట్లకు పైగా వ్యయంతో తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లను పునర్నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే 4 స్టేషన్ల పనులు పూర్తయి ప్రారంభమయ్యాయి.
{{/usCountry}}ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 47,984 కోట్ల విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 2,000 కోట్లకు పైగా వ్యయంతో తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లను పునర్నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే 4 స్టేషన్ల పనులు పూర్తయి ప్రారంభమయ్యాయి.
{{/usCountry}}'ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను రూ. 521 కోట్లతో అందుబాటులోకి తెచ్చాం. స్థానిక చేతివృత్తుల కళాకారులు, చేనేత కార్మికులు మరియు గిరిజన సంఘాల జీవనోపాధి కోసం రాష్ట్రంలోని 73 రైల్వే స్టేషన్లలో 88 స్టాళ్లను ఏర్పాటు చేశారు.' అని కిషన్ రెడ్డి చెప్పారు.
భవిష్యత్తు మౌలిక సదుపాయాల గురించి కిషన్ రెడ్డి చెబుతూ.. హైదరాబాద్ కేంద్రంగా ఇతర ప్రధాన నగరాల రాజధానులను అనుసంధానిస్తూ, గంటకు 350 కి.మీ వేగంతో ప్రయాణించే మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లను ఎలివేటెడ్ ట్రాక్‌లపై నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రారంభోత్సవం అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రైలులో గజ్వేల్ వరకు ప్రయాణించారు.