హైదరాబాద్‌లో కొరియన్ కల్చరల్ ఫెస్ట్.. ప్రధాన ఆకర్షణగా నిలవనున్న కే-పాప్ బ్యాండ్ NTX
అక్టోబర్ 25న హైదరాబాద్‌లో కొరియన్ కల్చరల్ ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుకలకు కే-పాప్ బ్యాండ్ NTX కూడా రానుంది.
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి ఆతిథ్యం ఇవ్వబోతోంది. భారత్, దక్షిణ కొరియా దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో హైదరాబాద్‌లోని ప్రసిద్ధ శిల్పకళా వేదికలో కె-హార్మొనీ ఫెస్టా 2026(K-Harmony Festa 2026) అత్యంత వైభవంగా జరగనుంది. కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా(KCCI), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.

కొరియా కల్చర్ డే 2026 వేడుకల్లో భాగంగా వన్ లైట్, టూ సిటీస్(One Light, Two Cities) అనే ప్రత్యేక థీమ్‌తో ఈ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుక సీయోల్, హైదరాబాద్ నగరాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను వేడుకలా జరుపుకోవడానికి ఒక గొప్ప వేదికగా నిలవనుంది.
ఈ ఈవెంట్ శిల్పకళా వేదికలో అక్టోబర్ 25(ఆదివారం)న జరగనుంది. మధ్యాహ్నం 1:00 గంటల నుంచి సందర్శకులకు ప్రవేశం ఉంటుంది. సాయంత్రం 5:30 గంటలకు అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది.
ఈ సాంస్కృతిక ఉత్సవంలో రెండు దేశాల సాంప్రదాయ, ఆధునిక కళారూపాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. తెలంగాణ గడ్డకు చెందిన వీరత్వానికి ప్రతీక అయిన పేరిణి శివతాండవం, జానపద కళారూపం డప్పుల ప్రదర్శనలు నగరవాసులను ఆకట్టుకోనుండగా; మరోవైపు కొరియాకు చెందిన సాంప్రదాయ కళలు, సంగీతం పోటీపడనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ ‘NTX’ కే-పాప్ బాయ్ బ్యాండ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఈ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలవనుంది. కొరియన్ మార్షల్ ఆర్ట్ తైక్వాండో యోధుల సాహసోపేత విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. కొరియన్ సాంప్రదాయ సంగీతం: కొరియా సంస్కృతిని ప్రతిబింబించే సంగీత, నృత్య కార్యక్రమాలు ఉంటాయి.
ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు దేశాల మధ్య పరస్పర అవగాహనను, స్నేహ సంబంధాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. 'ఇలాంటి అంతర్జాతీయ వేదికలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుసంపన్నమైన చారిత్రక వారసత్వాన్ని, జానపద కళలను, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచస్థాయిలో ప్రదర్శించడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తాయి. తెలంగాణ కళారూపాలు అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించడం మనందరికీ గర్వకారణం.' అని ఆయన పేర్కొన్నారు.
గత కొన్నేళ్లుగా భారతదేశంలో, ముఖ్యంగా యువతలో కొరియన్ కల్చర్‌ను ఇష్టపడేవారి సంఖ్య పెరుగుతోంది. కే-డ్రామాలు, కే-పాప్ సంగీతం, కొరియన్ వంటకాలకు హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో శిల్పకళా వేదికలో జరుగుతున్న ‘కె-హార్మొనీ ఫెస్టా 2026’ నగరంలోని కే-పాప్ ప్రేమికులకు, కళాభిమానులను ఆకట్టుకోనున్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


