జూబ్లీహిల్స్ మళ్లీ కొడుతున్నామని… ఇక్కడ గెలుపు పక్కా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా షేక్‌పేట్‌లో రోడ్ షోలో నిర్వహించారు.

2023 ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదన్నారు. జూబ్లీహిల్స్‌లో కూడా మాగంటి గోపినాథ్‌ను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తూ ఆరోగ్య సమస్యలతో గోపినాథ్ గారు కన్నుమూశారని… ఇలాంటి పరిస్థితుల్లో మాగంటి సునీతను ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదని విమర్శించారు.
"ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో మీరంతా ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. అరచేతిలో స్వర్గం చూపిస్తూ.. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన చూశారు.. రెండేళ్ల కాంగ్రెస్ పాలన చూశారు. ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కరికైనా మేలు జరిగిందా ఆలోచించాలి. వృద్ధులకు కేసీఆర్ రూ. 2 వేలు పెన్షన్ ఇస్తే.. కాంగ్రెస్ రూ. 4 వేలు ఇస్తామని చెప్పారు. యువతులకు రూ. 2500 ఇస్తామని చెప్పారు ఇచ్చారా? ఆడబిడ్డలకు స్కూటీ ఇస్తామన్నారు.. ఇచ్చారా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
“బతుకమ్మ సమయంలో కేసీఆర్ చీరలు ఇస్తే.. ఇప్పుడు దాన్ని కూడా ఇవ్వలేదు. కేసీఆర్ రంజాన్ తోఫా ఇచ్చారు.. క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చేవారు. ఇప్పుడు అవేవి ప్రజలకు అందట్లేదు. రెండేళ్లలో ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నిలబెట్టుకోలేదు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ఓట్లడుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు. హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కేసీఆర్ కట్టించారు. ఈ కాంగ్రెస్ సర్కార్ ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. ఇందిరమ్మ రాజ్యం అంటారు.. పేదల ఇంటిపైకి బుల్డోజర్ పంపిస్తున్నారు. ఈ రెండేళ్లలోనే కొన్ని వేలమంది పేదల ఇళ్లు నేలమట్టం చేశారు. అన్ని రకాలుగా తెలంగాణను కాంగ్రెస్ భ్రష్టుపట్టించింది. హైడ్రాను తెచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నాశనం చేశారు” అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఆటో అన్నలను ఇబ్బంది పెట్టారు.. రూ. 2500 సంపాదించే ఆటో అన్నలు ఇప్పుడు వెయ్యి, 1200ల కోసం కష్టపడుతున్నారు.ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాయి. కేసీఆర్ అద్భుతంగా పనిచేసి తెలంగాణను నెంబర్ వన్ చేస్తే.. ఇప్పుడు లాస్ట్‌లో నిలబెట్టారు. హామీల గురించి అడిగితే రేవంత్ రెడ్డి దబాయిస్తున్నారు.. ఇది ఒక కుటుంబ పెద్దకు ఉండాల్సిన లక్షణమా.. ? పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే.. నేనేం చేయకపోయినా వీళ్లు మళ్లీ నాకే ఓటేస్తారని రేవంత్ రెడ్డి అనుకుంటారు.కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలి” అని కేటీఆర్ కోరారు.
{{/usCountry}}“ఆటో అన్నలను ఇబ్బంది పెట్టారు.. రూ. 2500 సంపాదించే ఆటో అన్నలు ఇప్పుడు వెయ్యి, 1200ల కోసం కష్టపడుతున్నారు.ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాయి. కేసీఆర్ అద్భుతంగా పనిచేసి తెలంగాణను నెంబర్ వన్ చేస్తే.. ఇప్పుడు లాస్ట్‌లో నిలబెట్టారు. హామీల గురించి అడిగితే రేవంత్ రెడ్డి దబాయిస్తున్నారు.. ఇది ఒక కుటుంబ పెద్దకు ఉండాల్సిన లక్షణమా.. ? పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే.. నేనేం చేయకపోయినా వీళ్లు మళ్లీ నాకే ఓటేస్తారని రేవంత్ రెడ్డి అనుకుంటారు.కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలి” అని కేటీఆర్ కోరారు.
{{/usCountry}}