రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారులను వేధిస్తుందని కేటీఆర్ ఆరోపించారు. రూ. 500 కోట్ల టెండర్ పై రాజకీయ ఒత్తిడి మధ్య సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వీ వీఆర్ఎస్ తీసుకున్నారని అన్నారు. పరిపాలనను మాఫియా శైలిలో చేస్తున్నారని విమర్శించారు. కుట్రలకు పాల్పడవద్దని అధికారులకు కేటీఆర్ సూచించారు. అధికారులు తప్పుడు పనులు చేయాలని ప్రభుత్వ పెద్దలు వేధిస్తున్నారని ఆరోపించారు. అందుకే వారు వీఆర్ఎస్ తీసుకుంటున్నారన్నారు. మంత్రి వేధింపులతోనే ఐఏఎస్ అధికారి వీఆర్ఎస్ తీసుకున్నట్టుగా వెల్లడించారు.

‘కాంగ్రెస్ దండుపాళ్యం ముఠానే రాష్ట్రాన్ని నడిపిస్తున్నది. ఆ దండుపాళ్యం ముఠాకి నాయకుడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నాయకుల అవినీతికి ప్రభుత్వ అధికారులు కూడా భయపడుతున్నారు. వాళ్ళ వాటాల పంచాయితీలో మాకు భాగస్వామ్యం వద్దు, మాకు సంబంధం లేదంటూ ఐఏఎస్ అధికారులు పారిపోతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తప్పుడు పనులు చేయమని వేధించడం వల్లనే నేడు రిజ్వీ గారు వీఆర్‌ఎస్ తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు, అక్రమాలకు ప్రభుత్వ అధికారులు భాగస్వాములు అయితే, గతంలో మాదిరి వారికి శిక్ష పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.’ అని కేటీఆర్ అన్నారు.
చాలా నిజాయితీపరులైన అధికారులను కూడా భయం పట్టుకుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అవినీతి వ్యవహారాలతో తమకు సంబంధం లేదని వారు చెబుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ దండుపాళ్యం మంత్రుల ముఠా నిజాయితీ పాలనను అసాధ్యం చేసిందన్నారు. దశాబ్ద కాలం సర్వీస్ మిగిలి ఉన్నప్పటికీ సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వీని వ్యవస్థ నుండి బయటకు పంపారని అన్నారు.
‘రిజ్వీ నిజాయితీకి మారుపేరు. కానీ ముఖ్యమంత్రి అల్లుడు, మంత్రి జూపల్లి కృష్ణారావు కుమారుడి మధ్య జరిగిన రూ. 500 కోట్ల టెండర్ పోరులో రాజకీయ ఒత్తిడిని తట్టుకోలేక ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.’ అని కేటీఆర్ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ పరిపాలన అవినీతి కంపు రాష్ట్ర వ్యాప్తంగా కొడుతుందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణను తాము అగ్రికల్చర్లో అగ్రస్థానంలో నిలిపామని, కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకువచ్చిందని పేర్కొన్నారు. రాజకీయ జీవితంలో ఇలాంటి బలహీన ముఖ్యమంత్రిని చూడలేదన్నారు.
{{/usCountry}}కాంగ్రెస్ పార్టీ పరిపాలన అవినీతి కంపు రాష్ట్ర వ్యాప్తంగా కొడుతుందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణను తాము అగ్రికల్చర్లో అగ్రస్థానంలో నిలిపామని, కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకువచ్చిందని పేర్కొన్నారు. రాజకీయ జీవితంలో ఇలాంటి బలహీన ముఖ్యమంత్రిని చూడలేదన్నారు.
{{/usCountry}}తెలంగాణలో అవినీతి విలయతాండవం చేస్తుందని కేటీఆర్ అన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర సచివాలయం దాకా రాష్ట్రంలోని అన్ని శాఖల్లో కొనసాగుతున్నాయన్నారు. సీఎం వేల కోట్లు సంపాదిస్తుంటే.. తాము వందల కోట్లయినా సంపాదించాలని మంత్రులు పోటీ పడుతున్నారన్నారు. తెలంగాణలో నడుస్తున్నది ఒక మాఫియా రాజ్యం, ఇందిరమ్మ.. రాజ్యం కాదు.. స్వయంగా మంత్రి కూతురు చెప్పిందన్నారు కేటీఆర్.