కాంగ్రెస్ దండుపాళ్యం ముఠానే రాష్ట్రాన్ని నడిపిస్తున్నది : కేటీఆర్
మంత్రుల మధ్య విభేదాలతో అధికారులు నలిగిపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంత్రుల ఒత్తిడికి తలొగ్గి తప్పులు చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారులను వేధిస్తుందని కేటీఆర్ ఆరోపించారు. రూ. 500 కోట్ల టెండర్ పై రాజకీయ ఒత్తిడి మధ్య సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వీ వీఆర్ఎస్ తీసుకున్నారని అన్నారు. పరిపాలనను మాఫియా శైలిలో చేస్తున్నారని విమర్శించారు. కుట్రలకు పాల్పడవద్దని అధికారులకు కేటీఆర్ సూచించారు. అధికారులు తప్పుడు పనులు చేయాలని ప్రభుత్వ పెద్దలు వేధిస్తున్నారని ఆరోపించారు. అందుకే వారు వీఆర్ఎస్ తీసుకుంటున్నారన్నారు. మంత్రి వేధింపులతోనే ఐఏఎస్ అధికారి వీఆర్ఎస్ తీసుకున్నట్టుగా వెల్లడించారు.

‘కాంగ్రెస్ దండుపాళ్యం ముఠానే రాష్ట్రాన్ని నడిపిస్తున్నది. ఆ దండుపాళ్యం ముఠాకి నాయకుడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నాయకుల అవినీతికి ప్రభుత్వ అధికారులు కూడా భయపడుతున్నారు. వాళ్ళ వాటాల పంచాయితీలో మాకు భాగస్వామ్యం వద్దు, మాకు సంబంధం లేదంటూ ఐఏఎస్ అధికారులు పారిపోతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తప్పుడు పనులు చేయమని వేధించడం వల్లనే నేడు రిజ్వీ గారు వీఆర్‌ఎస్ తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు, అక్రమాలకు ప్రభుత్వ అధికారులు భాగస్వాములు అయితే, గతంలో మాదిరి వారికి శిక్ష పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.’ అని కేటీఆర్ అన్నారు.
చాలా నిజాయితీపరులైన అధికారులను కూడా భయం పట్టుకుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అవినీతి వ్యవహారాలతో తమకు సంబంధం లేదని వారు చెబుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ దండుపాళ్యం మంత్రుల ముఠా నిజాయితీ పాలనను అసాధ్యం చేసిందన్నారు. దశాబ్ద కాలం సర్వీస్ మిగిలి ఉన్నప్పటికీ సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వీని వ్యవస్థ నుండి బయటకు పంపారని అన్నారు.
‘రిజ్వీ నిజాయితీకి మారుపేరు. కానీ ముఖ్యమంత్రి అల్లుడు, మంత్రి జూపల్లి కృష్ణారావు కుమారుడి మధ్య జరిగిన రూ. 500 కోట్ల టెండర్ పోరులో రాజకీయ ఒత్తిడిని తట్టుకోలేక ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.’ అని కేటీఆర్ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ పరిపాలన అవినీతి కంపు రాష్ట్ర వ్యాప్తంగా కొడుతుందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణను తాము అగ్రికల్చర్లో అగ్రస్థానంలో నిలిపామని, కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకువచ్చిందని పేర్కొన్నారు. రాజకీయ జీవితంలో ఇలాంటి బలహీన ముఖ్యమంత్రిని చూడలేదన్నారు.
తెలంగాణలో అవినీతి విలయతాండవం చేస్తుందని కేటీఆర్ అన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర సచివాలయం దాకా రాష్ట్రంలోని అన్ని శాఖల్లో కొనసాగుతున్నాయన్నారు. సీఎం వేల కోట్లు సంపాదిస్తుంటే.. తాము వందల కోట్లయినా సంపాదించాలని మంత్రులు పోటీ పడుతున్నారన్నారు. తెలంగాణలో నడుస్తున్నది ఒక మాఫియా రాజ్యం, ఇందిరమ్మ.. రాజ్యం కాదు.. స్వయంగా మంత్రి కూతురు చెప్పిందన్నారు కేటీఆర్.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


