పార్టీ మారినట్టు కళ్ల ముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా, ఆధారాలు లేవంటున్నారు : కేటీఆర్

పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాలె యాదయ్యకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Published on: Jan 15, 2026, 21:47:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా వెనకేసుకుని వస్తున్న రాహుల్, రేవంత్ రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ అడుగడుగునా తూట్లు పొడుస్తున్నారని బబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిపై వేటు వేయాల్సిన స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లతో భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీ, తన దిగజారుడుతనాన్ని మరోసారి చాటిచెప్పిందని విమర్శించారు.

కేటీఆర్
కేటీఆర్

గతంలోనూ ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటుపడకుండా అడ్డుపడిన అప్రజాస్వామిక శక్తులే ఇవాళ కూడా రాజ్యాంగ విలువలకు నిలువునా పాతరేశాయన్నారు కేటీఆర్. పార్టీ మారినట్టు కళ్ళముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా, ఆధారాలు లేవనడం పవిత్రమైన శాసనసభను కూడా అవమానించడమేన్నారు.

కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగంపైనే కాదు, చివరికి అత్యున్నత న్యాయస్థానాలపైనా కూడా గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని కేటీఆర్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు వెళ్లేందుకు అధికార పార్టీ వణికిపోతోందని ఇవాల్టి తీర్పు తేటతెల్లం చేస్తోందన్నారు.

'గోడ దూకిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు విఫలయత్నం చేసినా ప్రయోజనం లేదు. వాళ్లంతా ప్రజాకోర్టులో ఎప్పుడో మాజీలు అయిపోయారనే విషయాన్ని గుర్తించకపోవడం కాంగ్రెస్ పార్టీ మూర్ఖత్వానికి నిదర్శనం. ప్రజాతీర్పును అవమానించిన జంప్ జిలానీలకు, గడప గడపకు వెళ్లి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పిన ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పే దాకా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటది.' అని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలపై అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని తీర్పు ఇచ్చారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలలో ఏడుగురు క్లియర్ అయ్యారు.

ఎమ్మెల్యేల అనర్హత కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. దానికి ముందు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తాజాగా కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ ఇచ్చారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య బీఆర్ఎస్‌కు చెందినవారని ఆయన తీర్పు ఇచ్చారు. వారు పార్టీలు మారారని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంటూ వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు.

దీంతో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలలో అరెకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్ రావు సహా ఏడుగురికి క్లీన్‌ చిట్ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులపై స్పీకర్ ఇంకా విచారణ పూర్తి చేయలేదు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణ ముగిసింది. కానీ తీర్పును రిజర్వ్‌లో ఉంచారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More