...
...
Next Story

ఐఎండీ వెదర్ రిపోర్ట్ : అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు..!

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. నవంబర్ 22వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఈ వారంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.

Published on: Nov 19, 2025, 12:14:46 IST
Advertisement

వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. ఈనెల 22వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏరడే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి 48 గంటల్లో మరింత స్పష్టంగా ఏర్పడే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి.

తెలంగాణలో వర్షాలు…

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా రిపోర్ట్ ప్రకారం... ఇవాళ, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుంది. ఎలాంటి హెచ్చరికలు లేవు. అయితే రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీ నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది.

ఇక నవంబర్ 22వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు పడొచ్చు. పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. నవంబర్ 25వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఏపీకి కూడా వర్ష సూచన…!

ఏపీలో చూస్తే…ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని తెలిపింది. రాయలసీంలో చూస్తే ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవు.

మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఇవాళ ఆసిఫాబాద్ లో 7.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఆ తర్వాత ఆదిలాబాద్ లో 8.8 డిగ్రీలు, సిరిసిల్లలో 9.0 డిగ్రీలు, కామారెడ్డిలో 9.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని తెలంగాణ వెదర్ మ్యాన్ పేర్కొన్నాడు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks