...
...
Next Story

TG Weather Updates : తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు - నైరుతి సీజన్ వర్షాలు ముగిసినట్టేనా..?

తెలంగాణలో రాగల రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక 28వ తేదీ నుంచి తేలికపాటి వర్షాలు మాత్రమే పడొచ్చు.

Published on: Sep 26, 2026, 16:06:00 IST
Advertisement

తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాగల 48 గంటల పాటు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఇవాళ్టి మధ్యాహ్నం రిపోర్ట్ ప్రకారం… రాబోయే రెండు రోజులలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడి వర్షాలు పడే సూచనలున్నాయి.

తెలంగాణ వెదర్ రిపోర్ట్
తెలంగాణ వెదర్ రిపోర్ట్

సెప్టెంబర్ 27 ఉదయం 8:30 వరకు కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 27 ఉదయం 8:30 నుండి సెప్టెంబర్ 28 ఉదయం 8:30 వరకు చూస్తే… జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఈనెల 28 నుంచి తేలికపాటి వర్షాలే….

ఇక సెప్టెంబర్ 28 నుంచి రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అక్టోబర్ 3 వరకు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ… ఎలాంటి తీవ్రమైన హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

ఇక ఈ సీజన్‌కు సంబంధించి నైరుతి రుతుపవనాల ప్రధాన వర్షాలు దాదాపుగా ముగిసినట్లేనని తెలంగాణ వెదర్ మ్యాన్ ట్వీట్ చేశాడు. ఆయన రిపోర్ట్ ప్రకారం…. సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 2 వరకు తెలంగాణ అంతటా తీవ్రమైన వేడి ఉండే అవకాశాలు ఉంది, చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 34-36°C వరకు నమోదయ్య అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశాడు.

ఆ తర్వాత, తూర్పు గాలుల ప్రభావం (ఈశాన్య రుతుపవనాలకు ముందు వచ్చే వర్షాలు) కారణంగా అక్టోబర్ 3-10 మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నాడు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks