గాంధీ విగ్రహం ఏర్పాటు వద్దు.. సీఎం రేవంత్ రెడ్డికి గాంధీ మునిమనవడు రిక్వెస్ట్

గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌పై మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ స్పందించారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

Updated on: Feb 24, 2026, 17:50:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ.. తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌లో భాగంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గాంధీ సరోవర్‌ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అక్కడ ఉన్న ఇళ్లను కూల్చడం, స్థానికులను వారి ఇళ్ల నుంచి వెళ్లగొట్టడం సరైన నిర్ణయం కాదని తుషార్ గాంధీ చెప్పుకొచ్చారు.

గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌పై తుషార్ గాంధీ కామెంట్స్
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌పై తుషార్ గాంధీ కామెంట్స్

ఇలాంటి చర్యలు మహాత్మా గాంధీ ఆశయాలకు విరుద్ధమని తుషార్ గాంధీ పేర్కొన్నారు. ఒకవేళ గాంధీ బతికి ఉంటే తన పేరు మీద, తన విగ్రహ నిర్మాణం కోసం ఇలాంటివి చేయెుద్దని చెప్పేవారని వ్యాఖ్యానించారు. అందుకే ఈ గాంధీ విగ్రహం ఏర్పాటును వెంటనే ఆపాలని తుషార్ గాంధీ కోరారు.

మూసీ ఈసీ నదితో కలిసే చోట ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహాన్ని నిర్మించాలని భావించిన ప్రాజెక్టుపై నేరుగా వ్యాఖ్యానించకపోయినా.. దాని వల్ల స్థానికులకు కలిగే ఇబ్బందులపై తుషార్ గాంధీ మాట్లాడారు.

'గాంధీ విగ్రహం కోసం నివాసితులను ఖాళీ చేయించి విగ్రహం ఏర్పాటు చేయడం గాంధీ వ్యతిరేక చర్య. తెలంగాణ ముఖ్యమంత్రికి నా విజ్ఞప్తి ఏమిటంటే దయచేసి అలా చేయకండి. బాపు బతికి ఉంటే నా పేరుతో అలా చేయకండి.. దాన్ని ఆపండి అని చెప్పేవారు.' అని తుషార్ గాంధీ ట్వీట్ చేశారు.

మూసీ దగ్గర ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని నివాసితులను ఖాళీ చేయిస్తున్నారనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం చేసిన భూసేకరణ ప్రయత్నాలు చాలా విమర్శలను ఎదుర్కొన్నాయి. 50 మీటర్ల బఫర్‌ జోన్ నియమం కంటే ముందే ఈ నిర్మాణం అన్ని అనుమతులతో జరిగినట్టుగా నివాసితులు చెబుతున్నారు.

అయితే అధికారులు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నారు. భూసేకరణ, పునరావాసం, న్యాయమైన పరిహారం అందిస్తామని చెబుతున్నారు.

మూసీ పునరుజ్జీవన చొరవలో భాగంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్ట్, పర్యావరణాన్ని పునరుద్ధరించడం, స్థిరమైన పట్టణ అభివృద్ధిని ప్రోత్సహించడం, నదీ తీరాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. 1948లో మహాత్మా గాంధీ అస్థికలను నిమజ్జనం చేసిన మూసీ, ఈసీ నదుల సంగమం వద్ద గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ, ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహాన్ని కూడా నిర్మిస్తామని ముఖ్యమంత్రి గతంలో ప్రకటించారు.

బీఆర్ఎస్ విమర్శలు

లంగర్ హౌజ్‌లోని మూసీ నది ఒడ్డున ఉన్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ల నివాసితులు దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్నా.. తమను అక్కడి నుండి బలవంతంగా వెళ్లగొట్టారని ఆరోపిస్తూ వీడియోలు వెలువడ్డాయి. మరోవైపు భారత రాష్ట్ర సమితి నాయకులు నివాసితులకు మద్దతు ఇచ్చి, డీపీఆర్ కూడా సిద్ధం చేయకుండానే ప్రభుత్వం నివాసితులను నిర్వాసితులను చేస్తోందని విమర్శించారు.

ప్రభుత్వం ఏం అంటుంది?

మరోవైపు తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ పేజీలో ప్రభుత్వం నిర్వాసితులను ఖాళీ చేయించడాన్ని ఖండించింది. ప్రాజెక్ట్ ఇంకా ప్రణాళిక దశలోనే ఉన్నందున, ఈ ప్రాజెక్ట్ కోసం ఎటువంటి బడ్జెట్‌ను ఖరారు చేయలేదని లేదా ప్రకటించలేదని స్పష్టం చేసింది. ఈ ప్రయోజనం కోసం భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని పేర్కొంది.

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం రంగారెడ్డి జిల్లాలో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించబడిందని తెలిపింది. కానీ హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఇంకా ప్రారంభం కాలేదని స్పష్టం చేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More