భారతీయ రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. రైలు టికెట్ల బుకింగ్‌లో దశాబ్దాలుగా వేధిస్తున్న సర్వర్ క్రాష్‌లు, పేమెంట్ ఫెయిల్యూర్స్, వెబ్‌సైట్ స్లో అవ్వడం వంటి సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తుంది. 1986 నుండి అమల్లో ఉన్న పాత ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) స్థానంలో అత్యాధునిక డిజిటల్ వ్యవస్థను ప్రవేశపెడుతోంది.

ఈ కొత్త అప్‌గ్రేడ్ ద్వారా ఒకేసారి లక్షలాది మంది ప్రయాణికులు లాగిన్ అయినా సర్వర్లు ఏమాత్రం హ్యాంగ్ అవ్వకుండా, కేవలం నిమిషాల వ్యవధిలోనే లక్షల టికెట్లు బుక్ చేసుకునేలా రైల్వే శాఖ ఈ మౌలిక వసతులను బలోపేతం చేసింది. పాత సిస్టమ్ నుండి కొత్త సిస్టమ్‌లోకి మారే క్రమంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అప్‌గ్రేడ్ ప్రక్రియను అత్యంత సాఫీగా పూర్తి చేస్తున్నారు అధికారులు.
భారతీయ రైల్వే తొలిసారిగా 2002లో ఇంటర్నెట్ ఆధారిత టికెట్ బుకింగ్‌ను ప్రారంభించింది. అప్పటి నుండి ఇప్పటివరకు ఆన్‌లైన్ బుకింగ్స్ భారీగా పెరిగాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం.. రైల్వేలో అమ్ముడవుతున్న మొత్తం టికెట్లలో దాదాపు 88 శాతం టికెట్లు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారానే బుక్ అవుతుండటం విశేషం.
రైల్ వన్ యాప్
రైల్వే శాఖ గత ఏడాది ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన Rail One యాప్ ఊహించని రీతిలో దూసుకుపోతోంది. కేవలం ఒక్క ఏడాదిలోనే ఈ యాప్ ఏకంగా 3.5 కోట్ల డౌన్‌లోడ్‌లను దాటేసింది. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా రోజుకు సగటున 9.29 లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ యాప్‌లో ప్రయాణికులకు అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి.
సులభంగా టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్ చేసుకోవడం, లైవ్ ట్రైన్ రన్నింగ్ స్టేటస్ (రైలు ఎక్కడుందో లైవ్‌లో చూడటం), ప్లాట్‌ఫారమ్ వివరాలు తెలుసుకోవడం, ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదులు చేయడంలాంటి సేవలు రైల్ వన్ యాప్‌లో ఉన్నాయి.
కచ్చితత్వంతో ఏఐ వెయిటింగ్ లిస్ట్ ప్రిడిక్షన్!
{{/usCountry}}సులభంగా టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్ చేసుకోవడం, లైవ్ ట్రైన్ రన్నింగ్ స్టేటస్ (రైలు ఎక్కడుందో లైవ్‌లో చూడటం), ప్లాట్‌ఫారమ్ వివరాలు తెలుసుకోవడం, ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదులు చేయడంలాంటి సేవలు రైల్ వన్ యాప్‌లో ఉన్నాయి.
కచ్చితత్వంతో ఏఐ వెయిటింగ్ లిస్ట్ ప్రిడిక్షన్!
{{/usCountry}}ఈ ఏడాది రైల్వే శాఖ ప్రయాణికుల కోసం మరో సూపర్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత 'వెయిటింగ్ లిస్ట్ ప్రిడిక్షన్ టూల్'ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా మనం బుక్ చేసుకున్న వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? లేదా? అనేది ముందే ఊహించవచ్చు. గతంలో దీని కచ్చితత్వం కేవలం 53 శాతంగానే ఉండేది, కానీ ఇప్పుడది ఏకంగా 94 శాతానికి మెరుగైంది.
ఈ సరికొత్త ఏఐ టూల్ వల్ల ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందే ప్లాన్ చేసుకోవడానికి, కన్ఫర్మేషన్‌పై ఉన్న అంచనాలను ఖచ్చితంగా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఈ సరికొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ భారతదేశ డిజిటల్ రవాణా రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని రైల్వే అధికారులు నమ్మకంగా చెబుతున్నారు.