ఖమ్మం నగరంలో గుండెల్ని పిండేసే అత్యంత ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక అపార్ట్‌మెంట్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, తను చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఆమెను రెండో అంతస్తుపై నుంచి కిందకు తోసేసాడు ఒక కిరాతకుడు. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆ బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించడమే కాకుండా, రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీసింది.
అసలు ఏం జరిగింది?

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఓ కుటుంబం సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తోంది. ఆ కుటుంబంలో మైనర్ బాలిక ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసిన నిందితుడు మహ్మద్ గౌస్ ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం, ఆమె ఈ విషయాన్ని ఎవరికైనా చెబుతుందేమోనని భయపడ్డాడు. తన నేరాన్ని దాచడం కోసం, సదరు బాలికను అపార్ట్‌మెంట్ భవనం పైనుంచి కిందకు తోసేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.
భవనం పైనుంచి పడటంతో బాలికకు తీవ్ర రక్తస్రావమై, ఎముకలు విరిగాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాలిక కూడా కొద్ది కొద్దిగా జరిగిన విషయాన్ని చెప్పింది. తొలుత ఇదొక ప్రమాదంగా భావించినప్పటికీ, పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో అసలు కిరాతకం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.
మంత్రి తుమ్మల పరామర్శ
ఈ అమానుష ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలోని ఆసుపత్రికి చేరుకుని, చికిత్స పొందుతున్న బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి తుమ్మల అధికారులతో మాట్లాడి బాలికకు మెరుగైన ఉచిత వైద్య సహాయం అందేలా చూడాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
'ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడే వారిని సమాజం క్షమించదు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. నిందితుడిపై కఠిన చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి, నిందితుడికి త్వరలోనే కఠిన శిక్ష పడేలా చూస్తాం.' అని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి
{{/usCountry}}'ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడే వారిని సమాజం క్షమించదు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. నిందితుడిపై కఠిన చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి, నిందితుడికి త్వరలోనే కఠిన శిక్ష పడేలా చూస్తాం.' అని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి
{{/usCountry}}ఈ ఘటనపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ (BRS) పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి ఈ ఘటనే నిదర్శనమని మండిపడ్డారు. 'ఖమ్మంలో మైనర్ బాలికపై జరిగిన దాడి అత్యంత హేయమైనది. నిందితుడు ఎంతటి వాడైనా వదిలిపెట్టకూడదు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆపం.' అని కేటీఆర్ అన్నారు.
టీఆర్‌ఎస్ నేత కవిత ఈ ఘటనపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, మైనర్ బాలికల రక్షణ విషయంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆమె విమర్శించారు. ఖమ్మం నగరంలో ఒక అపార్ట్‌మెంట్‌లో బాలికపై లైంగిక దాడి చేసి, పైనుంచి తోసేసే ధైర్యం క్రిమినల్స్ కి ఎలా వస్తోంది? నిందితుడికి ఉరిశిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి తక్షణమే భారీ ఆర్థిక సాయం ప్రకటించాలని కవిత డిమాండ్ చేశారు.
ఈ ఘోర ఘటనకు వ్యతిరేకంగా ఖమ్మంలో స్థానికులు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ ఊపందుకుంది. ప్రభుత్వం ఈ కేసును ఎంత వేగంగా విచారించి, బాధితురాలికి న్యాయం చేస్తుందో చూడాలి.