...
...
Next Story

మేడారం జాతరలో న్యూజిలాండ్‌కు చెందిన మావోరీ తెగవారు.. వీడియో చూడండి

మేడారం జాతరలో న్యూజిలాండ్‌కు చెందిన మావోరీ తెగవారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నృత్యం చేశారు, సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు.

Published on: Jan 27, 2026, 11:30:55 IST
Advertisement

సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా న్యూజిలాండ్‌కు చెందిన మావోరీ గిరిజన తెగకు చెందినవారు ములుగు జిల్లాలోని మేడారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మావోరీ తెగ బృందం వారి సాంప్రదాయ హాకా నృత్యాన్ని ప్రదర్శించింది. ఇది యుద్ధానికి వెళ్ళే ముందు గిరిజన యోధులను ప్రేరేపించడానికి సాంప్రదాయకంగా ఉపయోగించే శక్తివంతమైన ఆచార ప్రదర్శన అని చెబుతున్నారు.

మేడారంలో మావోరీ తెగ
మేడారంలో మావోరీ తెగ

అధికారుల ప్రకారం, న్యూజిలాండ్ నుండి గిరిజన తెగకు చెందినవారు రావడం వలన అంతర్జాతీయ గిరిజన సాంస్కృతిక విషయాలు తెలుస్తాయని, ఇక్కడి విషయాలు వారికి తెలుస్తాయని పేర్కొన్నారు. మేడారం జాతర సందర్శన సందర్భంగా మావోరీ తెగ బృందం వారి సాంప్రదాయ హాకా నృత్యాన్ని ప్రదర్శించింది..

మావోరీ కళాకారులతో కలిసి నృత్యం చేశారు మంత్రి సీతక్క. వారిని ప్రోత్సహించారు. మావోరీ తెగ ప్రతినిధి బృందాన్ని అంతకుముందు హృదయపూర్వకంగా స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గిరిజన సంస్కృతి సార్వత్రికమైనదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరిజన సమాజాలు ప్రకృతి, అడవులతో లోతైన బంధాన్ని పంచుకుంటాయని అన్నారు.

ఇటువంటి చర్యలు ప్రపంచవ్యాప్తంగా స్థానిక సమాజాల మధ్య పరస్పర అవగాహన, గౌరవాన్ని బలపరుస్తాయని మంత్రి సీతక్క అన్నారు. తరువాత మావోరీ ప్రతినిధి బృందాన్ని మేడారంలోని గిరిజన దేవతల దర్శనం కోసం తీసుకెళ్లారు. గిరిజన సంప్రదాయాలు, సంస్కృతిలో సమ్మక్క-సారలమ్మ ప్రాముఖ్యతను మంత్రి వివరించారు. సందర్శించిన అతిథులను సత్కరించారు.

సమ్మక్క-సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఇది జనవరి 28 నుండి 31 వరకు జరగనుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుండి భక్తులు పాల్గొంటారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks