హైదరాబాద్ నగర చరిత్రలో నిలిచిపోయే భారీ ఆపరేషన్‌ను ప్రభుత్వ యంత్రాంగం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో నిర్వహించింది. గతంలో ఎన్నడూ లేని విదంగా 861 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారులతో కలిసి హైడ్రా కాపాడింది. ఈ భూమి విలువ మార్కెట్లో రూ. 15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో పాటు ఇతర విభాగాలు ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఇప్పటికే ఇల్లు కట్టుకుని ఉన్న వారిని మినహాయించి ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇల్లు కట్టుకున్నపేదలు, సామాన్యులు ఆందోళన చెందాల్సిన పని లేదని ఎప్పటికప్పుడు మైకులో అధికారులు మైకు ద్వారా ప్రకటించారు. దీంతో పేదలంతా ఊపిరి పీల్చుకున్నారు.
హైడ్రా ఫెన్సింగ్ కార్యక్రమానికి సహకరించారు. ఇదే సమంలో అక్కడ పాత లే ఔట్లలోని ప్లాట్ల యజమానులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు. మా లే ఔట్లను కాపాడుకోడానికి మేమంతా కోర్టుకు వెళ్లి న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు.. కాదు లే ఔట్లు వేశాం ఆ భూమి మాది అని అక్కడి ప్లాట్ల యజమానులు కోర్టులో పోరాడుతున్నారు. మధ్యలో ఎం. ఎ. ముఖీం అనేటోడు వచ్చి అన్యాయంగా ఆ భూములను తెగనమ్ముకోడానికి ఇన్నాళ్లకు ప్రభుత్వ యంత్రాంగం అడ్డుకట్ట వేసిందని హర్షం వ్యక్తం చేశారు.
ముఖీం గెస్టు హౌస్‌తో పాటు.. ఫామ్ హౌస్ నేలమట్టం
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూరంలోని సర్వే నంబరు 1 నుంచి 220 వరకూ ఉన్న ప్రభుత్వ భూమిలో ఎలాంటి కట్టడాలు చేయరాదని 1998లో హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. ఆ తీర్పును ఏమాత్రం లెక్క చేయకుండా 2006లో ఎం. ఎ. ముఖీం గెస్టు హౌస్ కట్టాడు. గెస్ట్ హౌస్‌తో పాటు మొత్తం 40 ఎకరాల పరిధిలో ఫార్మ్ హౌస్ నిర్మించాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి హద్దులు పెట్టాడు. ఇక అటువైపు కన్నెత్తి చూడడానికి కూడా అవకాశం లేకుండా కాపలా పెట్టాడు. ఇక్కడితో ఆగకుండా అక్కడ భూములను అమ్మడం ప్రారంభించాడు.
దీంతో అక్కడి లే ఔట్లున్న వారు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ భూమి స్వరూపాన్ని మార్చరాదని ఇరు పక్షాలకూ 2013లో హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా.. 2.20 ఎకరాల్లో ముఖీం సోదరుడు ఎంఏ అజీం నిర్మించిన 6 అంతస్తుల అపార్టుమెంట్‌ను కూల్చేసింది హైడ్రా. స్విమ్మింగ్‌పూల్‌తో సహా విలాసవంతంగా నిర్మించుకున్న గెస్టు హౌస్‌తో పాటు అక్కడ నిర్మించిన గదులను ఇంటిని.. ఇంటి చుట్టూ 40 ఎకరాల మేర గడీలు పెట్టి నిర్మించుకున్న ఫామ్ హౌస్‌ను, గుర్రాలకోసం నిర్మించిన శాలలను తొలగించారు.
భూములు అమ్మకాలకు చెక్
{{/usCountry}}దీంతో అక్కడి లే ఔట్లున్న వారు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ భూమి స్వరూపాన్ని మార్చరాదని ఇరు పక్షాలకూ 2013లో హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా.. 2.20 ఎకరాల్లో ముఖీం సోదరుడు ఎంఏ అజీం నిర్మించిన 6 అంతస్తుల అపార్టుమెంట్‌ను కూల్చేసింది హైడ్రా. స్విమ్మింగ్‌పూల్‌తో సహా విలాసవంతంగా నిర్మించుకున్న గెస్టు హౌస్‌తో పాటు అక్కడ నిర్మించిన గదులను ఇంటిని.. ఇంటి చుట్టూ 40 ఎకరాల మేర గడీలు పెట్టి నిర్మించుకున్న ఫామ్ హౌస్‌ను, గుర్రాలకోసం నిర్మించిన శాలలను తొలగించారు.
భూములు అమ్మకాలకు చెక్
{{/usCountry}}కోర్టు తీర్పులు పెండింగ్ ఉండగా ఆ భూమితో ఎలాంటి సంబంధం లేని ముఖీంతో పాటు అతని అనుచరులు ఇష్టానుసారం అమ్మకాలు చేస్తుండడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. కోర్టు ఉత్తర్వులను ఏమాత్రం లెక్క చెయకుండా ప్లాట్లుగా అమ్మేస్తున్న వారికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి హైడ్రా చెక్ పెట్టింది. చట్టాలంటే భయం లేకుండా.. అధికారులను లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా కబ్జాలు చేసి అక్కడ లావాదేవీలు నిర్వహిస్తున్నముఖీం కార్యకలాపాలకు ఫుల్ స్టాప్ పెట్టింది.
భారీ పోలీసు బందోబస్తు మధ్య 861 ఎకరాలకు ఫెన్సింగ్ వేసింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో హైడ్రా యంత్రాంగం ఈ భారీ ఆపరేషన్ నిర్వహించింది. ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వందల కోట్ల రూపాయిలు కొల్లగొట్టిన ముఖీంకు హైడ్రా చెక్ పెట్టింది. 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. ఇప్పటికే కొన్ని ఇళ్లు నిర్మాణం జరిగింది. పేదలు కట్టుకున్న ఇళ్లను మినహాయించి ఖాళీగా ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం కాపాడింది.
ఈ భూమి వివరాలు..
- సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్ గ్రామంలోని 1 నుంచి 220 సర్వే నంబర్ల వరకూ 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.
- నిజాం పాలకులకు చెందినదిగా ఇది రికార్డుల్లో ఉంది. విలీన ప్రక్రియ ప్రకారం ప్రభుత్వ భూమిగా రికార్డులకెక్కింది.
- 2003లో హైకోర్టు డివిజన్ బెంచ్ (http://W.A.No.10/98 & ఇతర కేసులు తేదీ: 04.07.2003 )ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. అప్పటి జాయింట్ కలెక్టర్ 1263 ఎకరాలను ప్రభుత్వ భూమిగా ప్రకటించారు.