...
...
Next Story

మేడారం జాతర హుండీల లెక్కింపు పూర్తి - ఈసారి ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా..?

మేడారం జాతర హుండీ ఆదాయ లెక్కింపు ప్రక్రియ ముగిసింది. ఈసారి వచ్చిన ఆదాయాన్ని రూ.13.25 కోట్లుగా ప్రకటించారు.గత జాతరతో సమానంగా ఆదాయం వచ్చినట్లు లెక్కలు సూచిస్తున్నాయి.

Published on: Feb 12, 2026, 15:29:37 IST
Advertisement

ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర హుండీ లెక్కింపు ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఈ నెల 5వ తేదీ నుంచి హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో లెక్కింపు ప్రక్రియను కొనసాగించారు. మొత్తం 828 హుండీలను తెరిచి నగదు, ఆభరణాలను లెక్కించారు.

ఈసారి ఆదాయం ఎంతంటే..?

మేడారం మహా జాతర
మేడారం మహా జాతర

వారం రోజుల పాటు సుమారు 400 మంది సిబ్బంది దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మేడారం హుండీలను లెక్కింపను పూర్తి చేశారు. ఈసారి మొత్తం రూ.13,25,83,269 ఆదాయం వచ్చినట్లు దేవదాయశాఖ అధికారులు వెల్లడించారు. హుండీల్లో నగదుతో పాటు విదేశీ కరెన్సీ, రద్దు నోట్లు, బంగారం, వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి.

గత మహా జాతరలో 540 హుండీలను మాత్రమే ఏర్పాటు చేశారు. దీని ద్వారా రూ.13.25 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ ఈసారి 828 హుండీలు ఏర్పాటు చేసినప్పటికీ దాదాపు సమాన స్థాయిలోనే ఆదాయం వచ్చింది. హుండీల సంఖ్యను పెంచినప్పటికీ… ఆదాయం పెరుగుదల పరిమితంగానే ఉంది. ఇక హుండీల్లో వచ్చిన నగదు, ఆభరణాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంకుల్లో జమ చేయనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు.

సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య నిత్యం పెరుగుతూ వస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ మహా జాతరకు అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. 2018లో రూ. 8.14 కోట్ల ఆదాయం రాగా… 2020లో రూ. 9.87 కోట్లు, 2022లో రూ. 12.45 కోట్ల ఆదాయం వచ్చింది.

మేడారంలో గద్దెల విస్తరణ చేపట్టడంతో… మేడారం రూపురేఖలు మారిపోయాయి. శాశ్వత ప్రతిపాదికన రోడ్ల నిర్మాణంతో పాటు మరికొన్ని పనులు చేపట్టారు. ఫలితంగా గతంతో పోల్చితే మేడారంలో చాలా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం కూడా కొన్ని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కూడా ఆదివారం లేదా సెలవు దినాల్లో వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks