...
...
Next Story

మై మేడారం వాట్సాప్ చాట్‌బాట్.. వనదేవతల దర్శనానికి వెళ్లే వారికి చేతిలోనే సమాచారం!

మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చేవారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై మీ చేతిలోనే సమాచారం ఉండనుంది. మై మేడారం వాట్సాప్ చాట్‌బాట్, యాప్, వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Published on: Jan 14, 2026, 14:36:25 IST
Advertisement

మేడారం జాతరకు హాజరయ్యే భక్తుల సౌలభ్యం కోసం ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగిస్తోంది. భక్తులు వెంటనే నమ్మదగిన సమాచారాన్ని అందించే లక్ష్యంతో మై మేడారం వాట్సాప్ చాట్‌బాట్ సేవను ప్రారంభించారు అధికారులు. 7658912300కు మెసేజ్ పంపడం ద్వారా భక్తులు రూట్లు, ట్రాఫిక్ అప్డేట్స్, వైద్య శిబిరాల సమాచారం, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు, ఫిర్యాదు డెస్క్, తప్పిపోయిన వ్యక్తుల వివరాలు వంటి అనేక రకాల ముఖ్యమైన సేవలను పొందవచ్చు. చాట్‌బాట్ యూజర్ ఫ్రెండ్లీగా తయారు చేశారు. భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా రియల్-టైమ్ సహాయం పొందేందుకు వీలు కల్పిస్తుంది.

మేడారం జాతర 2026
మేడారం జాతర 2026

రెండేళ్లకు ఒకసారి జరిగే గిరిజన పండుగ సందర్భంగా మేడారం సందర్శించే లక్షలాది మంది భక్తుల భద్రత, సౌకర్యాన్ని నిర్ధారించడానికి, జనసమూహ నిర్వహణను మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే ప్రయత్నాలలో ఇది భాగం. ఈ సేవ భక్తులు తమ ప్రయాణాన్ని మెరుగ్గా ప్లాన్ చేసుకోవడానికి, అత్యవసర పరిస్థితులు లేదా ఫిర్యాదులకు వెంటనే స్పందించడానికి సహాయపడుతుందని అధికారులు తెలిపారు. మై మేడారం వాట్సాప్ చాట్‌బాట్, మేడారం జాతర అనుభవాన్ని భక్తులందరికీ సురక్షితమైన, సజావుగా, ఇబ్బంది లేకుండా అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

భక్తులు రూట్ మ్యాప్స్, పార్కింగ్, ఇతర సౌకర్యాల కోసం ఇబ్బంది పడకుండా మేడారం జాతర పేరుతో యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, https://medaramjathara2026.com పేరుతో వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూపొందించారు. ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో భక్తులకు అవసరమైన సమాచారం ఉంటుంది. వెబ్‌సైట్‌లో కావాల్సిన సమాచారం దొరుకుతుంది. మంచినీటి కేంద్రాలు, టాయిలెట్ బ్లాక్స్, స్నానఘట్టాలు ఎక్కడెక్కడ ఉన్నాయో.. గూగుల్ మ్యాప్ లొకేషన్‌తోపాటు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

ఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారా.. జాతరలో ఎవరైనా తప్పిపోతే.. వెంటనే రిపోర్ట్ చేసే సిస్టమ్, ఇతర సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది. మేడారం జాతర చరిత్ర, అమ్మవార్ల విశిష్టతను కూడా ఇందులో పెట్టారు. భక్తులు ఈ సాంకేతిక సేవలను వినియోగించుకుని, ఎలాంటి ఇబ్బందులు పడకుండా వనదేవతలను దర్శనం చేసుకోవాలని అధికారులు కోరారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe