మేడారానికి సరికొత్త రూపు - ఈసారి మరో లెవల్ లో మహా జాతర..! 8 ముఖ్యమైన అంశాలు

మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం రూ. 251 కోట్లతో ఈ పనులు జరుగుతున్నాయి. ఇందులో గద్దెల విస్తరణకే రూ. 101 కోట్లు వెచ్చిస్తున్నారు.

Published on: Dec 27, 2025, 17:43:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఈసారి మహా జాతరను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. వందల ఏళ్లపాటు చెక్కుచెదరకుండా నిలిచేలా గద్దెల శాశ్వత పునర్నిర్మాణం పనులు చేపట్టింది.

మేడారం మహాజాతరకు ఏర్పాట్లు
మేడారం మహాజాతరకు ఏర్పాట్లు

మేడారం జాతరకు ఏర్పాట్లు - ముఖ్యమైన అంశాలు:

  • మేడారం సమ్మక్క - సారలమ్మ మహా జాతరకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం రూ. 251 కోట్లతో మేడారం సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.
  • గద్దెల విస్తరణకే రూ. 101 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఈ పనులు జరుగుతున్నాయి. 4,000 టన్నుల గ్రానైట్‌తో గద్దెల ప్రాంగణ నిర్మాణ పనులు చేపట్టారు.
  • 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించిన 7,000కి పైగా శిల్పాలు, 930 ఏళ్ల కోయల తాళపత్ర గ్రంథాల ఆధారంగా శిల్ప రూపకల్పన చేశారు.
  • 46 స్తంభాలతో 271 చ.మీ విస్తీర్ణంలో ప్రాకారం, 8 స్తంభాలతో వృత్తాకార గద్దె నిర్మాణం చేపట్టారు.
  • 40 అడుగుల వెడల్పుతో 3 స్వాగత తోరణాలు, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలు, 50 అడుగుల వెడల్పుతో ప్రధాన స్వాగత తోరణం ఉంటుంది.
  • ప్రస్తుతం ఉన్న చెట్లను తొలగించకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. బండారి, మర్రి, వెదురు, వేప, ఇప్ప తదితర 12 రకాల పవిత్ర వృక్షాలు ఇక్కడ ఉన్నాయి.
  • 140 రకాల ఆయుర్వేద మొక్కల నాటనున్నారు. పూజారుల సంఘం ఆమోదంతోనే అన్ని పనులు జరుగుతున్నాయి.
  • 2026 జనవరి 28వ తేదీ బుధవారం సారలమ్మ రాకతో మేడారం మహా జాతర ప్రారంభమవుతుంది. 29న గురువారం సమ్మక్క దేవత గద్దెకు రావడం, 30న శుక్రవారం భక్తులు మొక్కులు సమర్పించుకోవడం, 31వ తేదీ దేవతల వనప్రవేశంతో జాతర ముగియనుంది.

మొత్తంగా చూస్తే గతంలో చూసిన మేడారానికి… ప్రస్తుతం చూడబోయే మేడారానికి చాలా తేడాలుండనున్నాయి. గద్దెల విస్తరణలో భాగంగా చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. జాతరలోపే నిర్మాణ పనులన్నీ పూర్తి కావాలని సర్కార్ స్పష్టం చేసింది. ఆ దిశగానే కాంట్రాక్టర్లు కూడా పనులు జరుపుతున్నారు జిల్లా మంత్రులు కూడా ఎప్పకికప్పుడు సమీక్షిస్తుండగా… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆరా తీస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More