మేడారం పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదు : సీఎం రేవంత్ రెడ్డి
మేడారం ఆలయం చుట్టూ పచ్చదనాన్ని పెంపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆలయం చుట్టూ నాలుగు వైపులా ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయాలన్నారు.
2026లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర దృష్ట్యా మేడారంలో జరుగుతున్న పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడారం పనులపై ఆరా తీశారు. ఆలయం దగ్గర ఉన్న చెట్లను తొలగించవద్దని ఆదేశించారు. నాణ్యత విషయంలో అస్సలు రాజీపడవద్దు, నిర్మాణ పనుల్లో విమర్శలకు అవకాశం ఇవ్వవద్దు అని స్పష్టం చేశారు.

అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కొనసాగుతున్న పనుల గురించి ముఖ్యమంత్రికి వివరించారు. ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు. ఆలయం దగ్గర వరద నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. ఆలయం వద్ద నాలుగు వైపులా ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయాలని, ఆలయం చుట్టూ పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు గ్రాండ్ లుక్ ఇచ్చేలా లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
తక్కువ వడ్డీకి రుణాలు అందించండి : సీఎం
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి HUDCO ఛైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను కోరారు. సోమవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రితో HUDCO చైర్మన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన భారత్ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ మెట్రో రైల్ పొడిగింపు, ఆర్‌ఆర్‌ఆర్, రేడియల్ రోడ్ల నిర్మాణానికి తక్కువ వడ్డీ రేటుకు రుణాలు అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
భారత్ ఫ్యూచర్ సిటీ నుండి బెంగళూరు, అమరావతి మీదుగా చెన్నై వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల నిర్మాణం, బందర్ పోర్టుకు గ్రీన్‌ఫీల్డ్ హైవే, బుల్లెట్ రైలు గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. HUDCO ఛైర్మన్‌కు వివరించారు. గతంలో ప్రభుత్వం తీసుకున్న రుణాలపై అధిక వడ్డీ రేటును ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రుణాలపై అధిక వడ్డీ రేటు చెల్లింపు సమస్యను పరిష్కరించడానికి ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, కొత్త ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేటుకు రుణాలు అందించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటికే రుణాలు మంజూరు అయ్యాయని, మరో 10 లక్షల ఇళ్ల నిర్మాణానికి రుణాలు వెంటనే విడుదల చేయడానికి కూడా HUDCO ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీలలో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని హడ్కో ఛైర్మన్‌ను ఆహ్వానించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


