జనవరి 28 నుండి 31 వరకు ములుగు జిల్లాలోని మేడారంలో సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు సర్వం సిద్ధమైంది. గిరిజన దేవతలు సమ్మక్క -సారలమ్మల మహా జాతరకు తెలంగాణ, పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌తోటాపుగా ఇతర రాష్ట్రాల నుండి మెుత్తం కలుపుకొని మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ప్రపంచంలోని జరిగే అతిపెద్ద గిరిజన జాతర ఇది.

జనవరి 28న సాయంత్రం గిరిజన పూజారులు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను గద్దెలపైకి ప్రతిష్ఠించడంతో మహా జాతరలో కీలకఘట్టం ప్రారంభమవుతుంది. జనవరి 29న సాయంత్రం దాదాపు అదే సమయంలో సమ్మక్క చిలకలగుట్టను నుంచి తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. ఈ సమయం మేడారంలో భక్తులు ఊగిపోతుంటారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవానికి ఆరు నెలల క్రితమే సన్నాహాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 19న పునర్నిర్మించిన ప్రాంగణాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ .101 కోట్లతో గిరిజనుల ఆరాధ్యదైవమైన సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజుల గద్దెలు పునర్నిర్మించింది .
2026 మహా జాతరను సందర్శించే భక్తుల సౌలభ్యం కోసం రూ. 150 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టింది. ఈ ఉత్సవ నిర్వహణలో 21 ప్రభుత్వ విభాగాలు, దాదాపు 42,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. భక్తుల రాక, నిష్క్రమణ, ప్రాథమిక సౌకర్యాల ఏర్పాటు, భద్రత, పరిశుభ్రత, వైద్య సౌకర్యాలు సరిగా అందేలా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.
ఈ పండుగ కోసం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ 4,000 బస్సులను నడుపుతోంది. మెుత్తం 51 వేల ట్రిప్పులను ప్లాన్ చేసింది. ఈ మహా జాతర కోసం 5,000 మందికి పైగా ఆరోగ్య సిబ్బంది, ప్రభుత్వ అంబులెన్స్‌లు, 40 బైక్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు.
డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ.. రాష్ట్ర ప్రభుత్వం భక్తుల సౌలభ్యం కోసం అధికారిక వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్, వాట్సాప్ చాట్‌బాట్‌ను ప్రారంభించింది. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వం యాప్‌లో భద్రతా మాడ్యూల్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో అత్యవసర పరిస్థితుల్లో SOS హెచ్చరికను పంపడం, ఫిర్యాదులను నమోదు చేయడం వంటివి ఉన్నాయి. అంతేకాదు చిన్నపిల్లలు తప్పిపోకుండా రిస్ట్బ్యాండ్లను ఈసారి ప్రవేశపెట్టారు. దీని ద్వారా పిల్లలు తప్పిపోతే ఈజీగా తల్లిదండ్రులకు వద్దకు చేరుకుంటారు.
{{/usCountry}}డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ.. రాష్ట్ర ప్రభుత్వం భక్తుల సౌలభ్యం కోసం అధికారిక వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్, వాట్సాప్ చాట్‌బాట్‌ను ప్రారంభించింది. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వం యాప్‌లో భద్రతా మాడ్యూల్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో అత్యవసర పరిస్థితుల్లో SOS హెచ్చరికను పంపడం, ఫిర్యాదులను నమోదు చేయడం వంటివి ఉన్నాయి. అంతేకాదు చిన్నపిల్లలు తప్పిపోకుండా రిస్ట్బ్యాండ్లను ఈసారి ప్రవేశపెట్టారు. దీని ద్వారా పిల్లలు తప్పిపోతే ఈజీగా తల్లిదండ్రులకు వద్దకు చేరుకుంటారు.
{{/usCountry}}ఈ పండుగలో ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడానికి, పర్యావరణ అనుకూల చర్యలను అనుసరించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. జంపన్నవాగు వద్ద స్నానాల కోసం ఏర్పాట్లు చేసింది. జంపన్నవాగులో సరిపడా నీరు ప్రవహిస్తోంది.