సమ్మక్క సారక్కల వనప్రవేశం - ముగిసిన మేడారం మహా జాతర

మేడారం మహా జాతర ముగిసింది. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క - సారక్కలు వనప్రవేశం చేశారు. భక్తశ్రద్ధలతో భక్తులు అమ్మవార్లకు వీడ్కోలు పలికారు.

Published on: Jan 31, 2026, 22:23:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మేడారం జాతర అత్యంత ఘనంగా ముగిసింది. గద్దెలపై కొలువుదీరి మూడు రోజులుగా పూజలందుకున్న వనదేవతలను భక్తజన సందోహాం మధ్య పూజారులు వన ప్రవేశం చేయించారు. శనివారం సాయంత్రం నిర్వహించిన ఈ వేడుక ఆద్యంతం ఉద్వేగభరితంగా సాగింది.

సమ్మక్క సారక్కల వనప్రవేశం - ముగిసిన మేడారం మహా జాతర
సమ్మక్క సారక్కల వనప్రవేశం - ముగిసిన మేడారం మహా జాతర

సమ్మక్కను సాగనంపే క్రతవు అత్యంత ఉద్వేగభరితంగా ముందుకు సాగింది. సమ్మక్కను గద్దె నుంచి తీసుకొని చిలకలగుట్టకు చేర్చే వరకు దారిపొడవునా భక్తులు వెంటనడిచారు. ప్రత్యేక నృత్యాలు, వాయిద్యాల చప్పుళ్ల మధ్య ఈ క్రతువు పూర్తి అయింది. మరోవైపు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను సైతం ఆయా పూజారులు తమ ప్రాంతంలోని గుళ్లకు తీసుకెళ్లారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More