Hyderabad : అత్యవసర వైద్య సేవలు బలోపేతం - 'మెడికవర్' హాస్పిటల్ ముందడుగు, కీలక ఒప్పందం

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రారంభం కానున్న మెడికవర్ హాస్పిటల్  కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర సేవల్లో పూర్తి సంసిద్ధతను వ్యక్తం చేసేలా… 'Evergreen Healthcare‌"తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

Published on: Feb 20, 2026, 18:34:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రారంభంకానున్న మెడికవర్ హాస్పిటల్… అధికారిక ప్రారంభానికి ముందే అత్యవసర వైద్య సేవల బలోపేతానికి కీలక ముందడుగు వేసింది. దేశీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో రోగుల అత్యవసర రవాణా మరియు సమన్వయ సేవలను మెరుగుపరచేందుకు ‘Evergreen Healthcare‌’ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

Evergreen Healthcare‌తో మెడికవర్ హాస్పిటల్ భాగస్వామ్య ఒప్పందం
Evergreen Healthcare‌తో మెడికవర్ హాస్పిటల్ భాగస్వామ్య ఒప్పందం

ఆసుపత్రి ప్రారంభమైన తొలి రోజు నుంచే అత్యవసర పరిస్థితులను సమర్థంగా నిర్వహించే సమగ్ర వ్యవస్థ సిద్ధంగా ఉండాలనే దృఢ సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎయిర్ అంబులెన్స్ సేవలు, రాష్ట్రాల మధ్య క్రిటికల్ కేర్ ట్రాన్స్‌ఫర్లు, క్లిష్టమైన మరియు అత్యాధునిక చికిత్స అవసరమయ్యే కేసుల కోసం అంతర్జాతీయ రోగుల రవాణా వంటి సేవలు సమన్వయంతో అందించబడనున్నాయి.

ప్రమాదాలు, గుండెపోటు, స్ట్రోక్, తీవ్రమైన గాయాలు, అవయవ వైఫల్యం వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం అమూల్యం. సమయానికి సరైన ఆసుపత్రికి రోగిని తరలించడం, మార్గమధ్యంలోనే నిపుణుల పర్యవేక్షణ అందించడం రోగి ప్రాణాలను కాపాడడంలో కీలకంగా మారుతుంది.

ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి డా. నయన్ శ్రీరాముల మాట్లాడుతూ… “అత్యవసర వైద్యం ఆసుపత్రి గుమ్మం వద్ద ప్రారంభం కాదు… అది సంఘటన చోటు వద్దే ప్రారంభమవుతుంది. సమర్థవంతమైన ఎయిర్ అంబులెన్స్ వ్యవస్థలు, వేగవంతమైన క్లినికల్ సమన్వయం మరియు నిరంతర వైద్య పర్యవేక్షణ రోగిని సరైన సమయంలో సరైన చికిత్సకు చేర్చడంలో అత్యంత ముఖ్యమైనవి” అని తెలిపారు.

ఈ భాగస్వామ్యాన్ని మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేష్ డేగ్లోర్కర్ ముందుండి సమన్వయం చేశారు. ఆసుపత్రి ప్రారంభానికి ముందే బలమైన అత్యవసర మరియు క్రిటికల్ కేర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ద్వారా… మెడికవర్ కేవలం ఒక ఆసుపత్రిని మాత్రమే కాదు, సమగ్ర వైద్య సేవల వ్యవస్థను నిర్మిస్తోంది. రోగుల భద్రత, వేగవంతమైన స్పందన, సమర్థవంతమైన వైద్య సమన్వయం మరియు అత్యున్నత ప్రమాణాల సేవలు అందించడం పట్ల మెడికవర్ నిబద్ధతను ఈ నిర్ణయం స్పష్టంగా తెలియజేస్తోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More