Mega Job Mela : నిరుద్యోగులకు మంచి ఛాన్స్ - ఈనెల 19న కోదాడలో మెగా జాబ్ మేళా, ఇవిగో వివరాలు

సూర్యాపేట జిల్లా కోదాడలో  సెప్టెంబర్ 19న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 200 పైగా కంపెనీలు ఈ మేళాలో పాల్గొనే అవకాశం ఉంది. ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

Published on: Sep 11, 2026, 13:59:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సూర్యాపేట జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా భారీ ఉద్యోగ నియామక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 19న కోదాడ నియోజకవర్గ కేంద్రంలోని సి.సి. రెడ్డి కన్వెన్షన్ హాల్‌లో "మేఘా జాబ్ మేళా"ను నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 నుంచి 250 ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో భాగస్వామ్యమై యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి.

కోదాడలో సెప్టెంబర్ 19న మెగా జాబ్ మేళా (image source Pixel)
కోదాడలో సెప్టెంబర్ 19న మెగా జాబ్ మేళా (image source Pixel)

ఉదయం 8 గంటల నుంచి…

కోదాడ పట్టణంలోని సి.సి. రెడ్డి కన్వెన్షన్ హాల్‌లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రోజంతా ఈ జాబ్‌మేళా కొనసాగనుంది. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటీఐ (ITI) పూర్తి చేసిన అభ్యర్థులను ఈ నియామక ప్రక్రియ కోసం ప్రత్యేకంగా సమీకరిస్తున్నారు. అర్హత, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ తగిన ప్యాకేజీతో అవకాశాలు కల్పించేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి.

ఈ మెగా జాబ్‌మేళా నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షలో కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహలతో పాటు సింగరేణి, పరిశ్రమల శాఖలకు చెందిన ముఖ్య అధికారులు పాల్గొన్నారు. వీరితో పాటు కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఈ సమావేశంలో భాగస్వాములయ్యారు.

గతంలో హుజూర్‌నగర్‌లో నిర్వహించిన మెగా జాబ్‌మేళా అపార విజయాన్ని సాధించింది. ఆ మేళా కోసం దాదాపు 40,000 మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకోగా, 20,463 మంది అభ్యర్థులు ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలు సాధించారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు కోదాడలో కూడా అంతకుమించి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి నిరుద్యోగ యువకుడికి, యువతికి ఈ జాబ్‌మేళా సమాచారం చేరేలా గ్రామస్థాయి వరకు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

"ఒక్క ఉద్యోగం లభిస్తే అది కేవలం ఆ యువకుడి జీవితాన్ని మాత్రమే కాదు, మొత్తం కుటుంబ భవిష్యత్తును సానుకూలంగా మారుస్తుంది," అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. యువతలో ఉన్న ప్రతిభకు, నైపుణ్యానికి తగిన అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కోదాడ మెగా జాబ్‌మేళా వేలాది మంది యువత నిరుద్యోగ కలలకు కొలువు దారి కావాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు కూడా చొరవ తీసుకుని తమ పిల్లలను ప్రోత్సహించి ఈ జాబ్‌మేళాకు పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More