మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూస్తూ మెగాస్టార్ ఫ్యాన్ మృతి
మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూస్తూ మెగాస్టార్ చిరంజీవి అభిమాని మృతిచెందాడు. ఈ ఘటనతో థియేటర్‌లో విషాదం నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సంక్రాంతి 2026కి వచ్చిన మూవీ మన శంకర వర ప్రసాద్ గారు. ఓ వైపు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ కావడంతో భారీ అంచనాల నడుమ సినిమా విడుదలైంది. ఈ మూవీలో వెంకటేష్ ఉండటంతో మరింత హైప్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్టుగానే సినిమా బాగుందని టాక్ వచ్చింది. దీంతో అభిమానులు సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ కూకట్‌పల్లి అర్జున్ థియేటర్‌లో సినిమా చూస్తూ మెగా అభిమాని మృతి చెందారు. ఆ వ్యక్తి గుండెపోటుతో చనిపోయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడిని 12వ బెటాలియన్‌కు చెందిన రిటైర్డ్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆనంద్ కుమార్‌గా గుర్తించారు. ఉదయం 11.30 గంటల షో చూడటానికి సినిమా థియేటర్‌కు వచ్చారు. సినిమా మధ్యలో, అకస్మాత్తుగా తన సీటులో కుప్పకూలిపోయాడు. తోటి ప్రేక్షకులు భయపడ్డారు.
తర్వాత తేరుకుని వెంటనే అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు ఆనంద్ చనిపోయినట్లు ప్రకటించారు. గుండెపోటు మరణానికి కారణమని అనుమానిస్తున్నారు. కూకట్‌పల్లి పోలీసులు థియేటర్‌ను సందర్శించి, ప్రాథమిక సమాచారం సేకరించి దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల తర్వాత మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందని పేర్కొన్నారు.
అలంకార్ థియేటర్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ లంగర్ హౌస్ ప్రాంతంలోని అలంకార్ థియేటర్ వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది మన శంకర వర ప్రసాద్ గారు ఉదయం షోను యాజమాన్యం అకస్మాత్తుగా రద్దు చేయడంతో ప్రేక్షకులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. బుక్‌మైషో యాప్ ద్వారా ఉదయం 7.30 గంటల షో కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్నామని, థియేటర్‌కు చేరుకున్న తర్వాతే రద్దు గురించి తమకు సమాచారం అందిందని ఫ్యాన్స్ తెలిపారు. బుకింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ముందస్తుగా క్యాన్సిల్ మెసేజ్ లేదా అలర్ట్ పంపలేదని ఆరోపించారు.
ఉద్రిక్తతలు చెలరేగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఉదయం 11 గంటల షోకు టికెట్ ఉన్నవారికి అనుమతిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


