మిదానీ హైదరాబాద్ లో 210 అప్రెంటిస్ ఖాళీలు - దరఖాస్తు తేదీలు, నోటిఫికేషన్ వివరాలు

హైదరాబాద్ లోని మిదానీ (మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్)లో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఐటీఐ ట్రేడ్‌, టెక్నీషియన్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలున్నాయి.  అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Nov 13, 2025, 15:46:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మిదానీ నుంచి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2025 ఏడాదికి సంబంధించి పలు విభాగాల్లో ఐటీఐ ట్రేడ్‌, టెక్నీషియన్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. https://midhani-india.in/ వెబ్ సైట్ లో నోటిఫికేషన్లతో పాటు అప్లికేషన్ ఫారమ్ ను కూడా అందుబాటులో ఉంచారు.

మిధాని హైదరాబాద్ లో అప్రెంటిస్ ఉద్యోగాలు
మిధాని హైదరాబాద్ లో అప్రెంటిస్ ఉద్యోగాలు

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌, టెక్నీషియన్‌ డిప్లొమా అప్రెంటిస్‌. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ లు కలిపి మొత్తం 210 ఖాళీలున్నాయి. వీటిలో అత్యధికంగా ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు 160గా ఉన్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు. విద్యార్హతల్లోని మార్కులతో పాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్రెంటిస్ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు స్టైఫండ్ చెల్లిస్తారు.

నోటిఫికేషన్ ముఖ్య వివరాలు:

  • నోటిఫికేషన్ ప్రకటన - మిదానీ, కంచన్ బాగ్, హైదరాబాద్
  • మొత్తం అప్రెంటిస్ ఖాళీలు - 210
  • ఖాళీల వివరాలు :ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్- 160, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌- 30, టెక్నీషియన్‌ డిప్లొమా అప్రెంటిస్‌ - 20. ఆయా ట్రేడుల వారీగా ఈ ఖాళీలున్నాయి. నోటిఫికేషన్ లో ఈ వివరాలను చూడొచ్చు.
  • దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగంలో లేదా ట్రేడ్ లో డిప్లొమా, డిగ్రీ , ఐటీఐ, ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌కు రూ.9,600 స్టైఫండ్ చెల్లిస్తారు. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.12,300, టెక్నీషియన్‌కు రూ.10,900గా ఉంటుంది.
  • వయోపరిమితి - 30 ఏళ్ల లోపు ఉండాలి.
  • దరఖాస్తు విధానం - అభ్యర్థులు ముందుగా https://www.apprenticeshipindia.gov.in/ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మిదానీ వెబ్ సైట్ లో మీ వివరాలను నమోదు చేయాలి. మీ రిజిస్ట్రేషన్ కాపీని “అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌, ట్రైనింగ్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌, మిధానీ, కంచన్‌భాగ్‌, హైదరాబాద్‌ -50008” చిరునామాకు పంపించాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ - 10 డిసెంబర్ 2025

ఈ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More