...
...
Next Story

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాలు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి!

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాలు అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Published on: Apr 9, 2026, 09:53:13 IST
Advertisement

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాలు అందించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే 1 నుంచి 12వ తరగతి విద్యార్థులు పాలు అందిస్తారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాలు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాలు

పంపిణీ కోసం రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి(విజయ డెయిరీ)కి మెుదటి విడతగా.. రూ.120 కోట్ల ఆర్డర్ ఇచ్చింది ప్రభుత్వం. వచ్చే విద్యా సంవత్సరం జూన్‌లో పాఠశాలలు తెరిచేనాటి నుంచి పాలు సరఫరా చేయాలని చెప్పింది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వం పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాలు అందనున్నాయి. విద్యార్థులకు పాలు పంపిణీ చేయాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ బాధ్యతలు విజయ డెయిరీకి అప్పగించాలని ఆదేశాలు ఇచ్చారు.

ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయంపూట బ్రేక్ ఫాస్ట్‌తోపాటుగా పాలను అందజేయనున్నారు. విద్యార్థుల్లో రక్తహీనతను తగ్గించడం, వారికి పౌష్టికాహార లోపాన్ని నివారించాలని ప్రభుత్వం అనుకుంటోంది. అందులో భాగంగా ఈ పథకాన్ని తీసుకొస్తుంది. జూన్ నెలలో విద్యాసంస్థలు పున:ప్రారంభం అయ్యే సమయానికి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని విద్యాశాఖ అనుకుంటోంది. రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు ఈ పథకం లబ్ధి చేకూరుస్తుంది.

పథకం అమలులో భాగంగా పాల సరఫరా బాధ్యతను ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీకి అప్పగించారు. ఇందుకు రూ.120 కోట్ల విలువైన భారీ ఆర్డర్‌ను ప్రభుత్వం కేటాయించింది. పాలు త్వరగా పాడవకుండా ఉండేందుకు, పంపిణీ సులభతరం చేయడానికి 150-200 ఎంఎల్ టెట్రా ప్యాకెట్లను సిద్ధం చేయనున్నారు.

జూన్ వరకు ఈ ప్యాకెట్లను స్కూళ్లకు చేర్చడానికి డెయిరీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనితో విద్యార్థులకు నాణ్యమైన పాలు అందుతాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

విద్యార్థులకు అందించే ఆహారంలో వైవిధ్యాన్ని, పోషక విలువలను సమపాళ్లలో అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక మెనూను రూపొందించింది. ఇందులో భాగంగా.. వారానికి మూడు రోజులు పాలను, మిగిలిన మూడు రోజులపాటు రాగి జావను పంపిణీ చేస్తారు. రాగి జావలో కాల్షియం, ఐరన్ అధికంగా ఉండటం వలన విద్యార్థులకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం భోజనం, ఉదయం పూట పౌష్టికాహారంతో విద్యార్థుల ఎదుగుదల బాగుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు పాఠశాలల్లో హాజరుశాతం పెరగుతుందని అధికారులు చెబుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks