...
...
Next Story

తెలుగు రాష్ట్రాల్లో తగ్గనున్న కనిష్ట ఉష్ణోగ్రతలు.. మరికొన్ని రోజులు చలి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరికొన్ని రోజులు ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి. ఇప్పటికే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.

Published on: Dec 15, 2025, 18:36:24 IST
Advertisement

తెలంగాణ తీవ్రమైన చలిగాలులను ఎదుర్కొంటోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 మూడు డిగ్రీల వరకు పడిపోతున్నాయి. డిసెంబర్ 16 వరకు చలి కొనసాగుతుందని ఐఎండీ హెచ్చరిస్తోంది, అయితే ఇండిపెండెంట్ వెదర్ ట్రాకర్ అంచనా ప్రకారం డిసెంబర్ 21 వరకు చలి కొనసాగవచ్చు. రాబోయే 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సోమవారం తెలిపింది.

ఏపీ, తెలంగాణలో మరింత చలి
ఏపీ, తెలంగాణలో మరింత చలి

రాబోయే ఏడు రోజులలో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ కార్యాలయం పేర్కొంది. గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శీతలగాలుల నమోదయ్యాయి. ఆదివారం, సోమవారం మధ్య రాత్రి ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 7.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని నివేదికలో తెలిపింది. ఆసిఫాబాద్ జిల్లాలో చలి విపరీతంగా ఉంది. వాంకిడి, కెరమెరి, జైనూర్, తిర్యాణి, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో చలి అధికంగా నమోదు అవుతుంది. సోమ, మంగళవారాల్లో 12 జిల్లాల్లో 8 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది.

'తెలంగాణలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ నుండి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని విడిగా ఉన్న ప్రాంతాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉంది.' అని ఐఎండీ-హైదరాబాద్ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లోనూ చలి ఎక్కువే ఉంటుంది.

హైదరాబాద్, దాని పరిసర జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెల్సియస్ నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య కొనసాగుతాయని IMD హైదరాబాద్ తెలిపింది. డిసెంబర్ 16 నుంచి 18 మధ్య ఉష్ణోగ్రతలు చాలా చల్లగా ఉంటాయని, డిసెంబర్ 19, 2025న మరో శక్తివంతమైన శీతలగాలులను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.

ఏపీలో చలి

కోస్తాంధ్రాలో సోమ, మంగళవారాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి లేదా రెండు చోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది. రాయలసీమలోనూ ఇదే పరిస్థితి కొనసాగనుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe