'సినీ ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశా' - మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీ గురించి తాను పట్టించుకోవడం పూర్తిగా బంద్ చేశానంటూ చెప్పారు. టికెట్ పెంపు ధరలతో తనకు సంబంధం లేదన్నారు. ఆ మెమోలను ఎవరు చేశారో తనకు తెలియదన్నారు.

Published on: Jan 10, 2026, 18:50:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశానని చెప్పుకొచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన… పుష్ప-2 సినిమా తర్వాత తన దగ్గరికి టికెట్ రేట్లు పెంచాలని ఎవ్వరూ రావద్దని చెప్పానని తెలిపారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఆ తర్వాత నుంచి నన్ను ఎవ్వరూ కలవడం లేదని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. పుష్ప 2 సినిమా విడుదల సమయంలోనే మహిళ చనిపోతే ఎందుకు పర్మిషన్ ఇచ్చానని బాధపడ్డానని గుర్తు చేశారు. బాబు ట్రీట్మెంట్ కు కూడా తాను డబ్బులు ఇచ్చానని… ఇప్పుడు సినిమాలకు పెరిగిన ధరలకు తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

రాజాసాబ్, చిరంజీవి సినిమాల బెనిఫిట్ షో టికెట్స్ ధరలు తాను పెంచలేదని మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనకు సంబంధం లేదని.. ఆ మెమోలను ఎవరు చేశారో తనకు తెలియదన్నారు.

మరోవైపు ఆయనపై కొన్ని మీడియా ఛానెళ్లలో వచ్చిన వార్తలను మంత్రి కోమటిరెడ్డి తీవ్రంగా ఖండించారు. “నాకు ఉన్న ఒక్క కొడుకుని కోల్పోయి వాడి పేరు మీద ఫౌండేషన్ పెట్టి ఎన్నో సేవలు చేశా, ఇప్పటికీ చేస్తున్నా. నన్ను ఏమైనా అనండి, నాపై ఏదైనా రాయండి కానీ మహిళా అధికారిపై ఇష్టమొచ్చినట్లు రాసి ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం. ఐఏఎస్ అధికారులను బదిలీ చేసే అధికారం సీఎంకే ఉంటుంది. త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రిని కోరుతున్నా"అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.

"తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశా. అద్దె ఇంట్లో ఉండి ప్రజలకు సేవ చేశా. నా కొడుకుని కోల్పోయినప్పుడే సగం చనిపోయా. దయచేసి నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి. అయినా ఏది పడితే అదే రాస్తాం అంటే పైనా ఆ దేవుడు చూసుకుంటాడు” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

“నాపై కుట్ర జరుగుతోందా? లేదా? అనేది నేను చెప్పలేను. ఓ న్యూస్ ఛానెల్‌లో వచ్చిన వార్తపై.. డీటెయిల్ ఎంక్వైరీ జరిపిస్తాం. ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయో.. త్వరలోనే నిజానిజాలు బయటపడతాయి” అని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More