నాపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారు.. సీఎం రేవంత్‌పై కొండా సురేఖ కామెంట్స్

తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని మంత్రి కొండా సురేఖ అన్నారు. తన బిడ్డ మాట్లాడితే తనకు ఎందుకు శిక్ష వేస్తారని ప్రశ్నిస్తారు.

Published on: Sep 2, 2026, 16:29:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన భవిష్యత్తు మరియు తదుపరి చర్యలపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తున్నానని తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె విలేకరులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడారు.

మంత్రి కొండా సురేఖ
మంత్రి కొండా సురేఖ

తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని మంత్రి కొండా సురేఖ అన్నారు. వేణుగోపాల్ అపాయింట్మెంట్ దొరకలేదన్నారు. తన బిడ్డ మాట్లాడితే తనకు ఎందుకు శిక్ష వేస్తారని ప్రశ్నించారు. మహిళలు స్వతంత్రంగా బతకాలని రాహుల్ చెపుతున్నారని, నా కూతురు మాట్లాడిన దానికి నాపై చర్యలు తీసుకోవద్దని కోరారు.

'మల్లికార్జున ఖర్గేను కలిశాను. నేను నా వివరణ ఖర్గేకు ఇచ్చాను. నాపై చర్యలు తీసుకో కంటే ముందు సీఎం పై చర్యలు తీసుకోవాలి. పదేళ్లు తానే సీఎం అని రేవంత్ ఎలా అంటారు. పొంగులేటి, బట్టి భార్య కమిషన్ల పైన కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయి. దానిపైన ఎందుకు మాట్లాడటం లేదు. చాలామంది రెడ్లు మాట్లాడితే వారి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు.' అని కొండా సురేఖ అన్నారు.

ఢిల్లీలో ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలసి నట్లు సురేఖ తెలిపారు. 'పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఇంకా చర్చలు జరగలేదు. ఇప్పటివరకు అధిష్ఠానం నన్ను రాజీనామా చేయమని చెప్పలేదు.' అని ఆమె వెల్లడించారు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పొలిటికల్ సమీకరణాలపై ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు పార్టీ ముఖ్య నాయకులందరికీ రాతపూర్వకంగా లేఖలు పంపినట్లు పేర్కొన్నారు. ఈ రోజు ఖర్గేను కలిసిన సమయంలో కూడా ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని స్వయంగా కోరినట్లు ఆమె వివరించారు.

పార్టీలో సామాజిక న్యాయం అమలు తీరుపై కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బహుజన సామాజిక వర్గానికి చెందిన తనకు ఒక న్యాయం, ఇతర సామాజిక వర్గాల నాయకులకు మరొక న్యాయం పాటిస్తారా? అని ఆమె ప్రశ్నించారు. 'రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ఇతర వర్గాల నాయకత్వంపై అనేక తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. మరి వాటన్నింటిపై అధిష్ఠానం ఏం సమాధానం చెబుతుంది? వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?' అంటూ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న కొండా సురేఖ నేరుగా అధిష్ఠానం పెద్దల వద్దే కేబినెట్ పరిణామాలను ప్రస్తావించడం, సామాజిక న్యాయం కోణంలో ప్రశ్నలు గుప్పించడం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. బీసీ గళం ఎత్తడం ద్వారా అధిష్ఠానంపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఢిల్లీ పెద్దలు ఈ వ్యవహారాన్ని ఎలా సర్దుబాటు చేస్తారో, కొండా సురేఖ పట్ల కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More