'ధ‌ర‌ణి పోర్ట‌ల్‌' అక్ర‌మాల‌పై ప్రభుత్వానికి నివేదిక - త్వ‌ర‌లోనే అన్ని జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్‌

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ అక్ర‌మాల‌పై ప్రభుత్వానికి ఉన్న‌త‌స్ధాయి క‌మిటీ నివేదిక చేరింది. త్వ‌ర‌లో 31 జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్‌ నిర్వహిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

Published on: Jan 25, 2026, 05:10:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లోని లొసుగుల‌ను ఆస‌రాగా చేసుకొని ప్ర‌భుత్వ భూముల‌ను కొల్ల‌గొట్టిన‌వారిని… రిజిస్ట్రేష‌న్‌ల చ‌లానా సొమ్మును కాజేసిన‌వారిని వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను అడ్డుపెట్టుకొని గ‌త ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు ప్ర‌భుత్వ భూముల‌ను కాజేశార‌ని… దీనిపై సిద్దిపేట‌, సిరిసిల్ల జిల్లాల్లో కేంద్ర ప్ర‌భుత్వ అనుబంధ సంస్ధ‌తో పైల‌ట్ కింద ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. ఇందులో అనేక అవినీతి అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు ప్రాథమిక నివేదిక‌లో స్ప‌ష్ట‌మైంద‌ని ఆయ‌న తెలిపారు.

మంత్రి పొంగులేటి సమీక్ష
మంత్రి పొంగులేటి సమీక్ష

ఈ ఫోరెన్సిక్ నివేదికను ప‌రిశీలించిన త‌ర్వాత మిగిలిన 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వ‌హిస్తామ‌ని మంత్రి పొంగులేటి ప్ర‌క‌టించారు. శనివారం స‌చివాల‌యంలోని త‌న‌ కార్యాల‌యంలో ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను అడ్డుపెట్టుకొని అక్ర‌మాల‌కు పాల్ప‌డిన సంఘ‌ట‌న‌ల‌పై ఏర్పాటు చేసిన ఉన్న‌త‌స్ధాయి క‌మిటీతో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స‌మావేశం నిర్వ‌హించారు. విచార‌ణ‌లో ఎదురైన అంశాలు,ఎవ‌రి పాత్ర ఎంత‌? తెర‌వెనుక ఎవ‌రైనా ఉన్నారా? రెవెన్యూ అధికారుల పాత్ర ఏమైనా ఉందా? వ‌ంటి అంశాల‌పై క‌మిటీ స‌భ్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. క‌మిటీ ప్రాధ‌మిక నివేదిక‌ను ప‌రిశీలించి మ‌రికొన్ని స‌ల‌హాలు సూచ‌న‌లు చేస్తూ మ‌రింత లోతైన విచార‌ణ జ‌రిపి తుది నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని సూచించారు.

ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాత మొత్తంగా 52 లక్షల లావాదేవీలకు గాను 35 లక్షల లావాదేవీలను పరిశీలించడం జరిగింది. ఇందులో ప్రాధ‌మికంగా 4,848 లావాదేవీల్లో లోటుపాట్లు జ‌రిగిన‌ట్లు గుర్తించ‌డం జ‌రిగింది. అయితే విచార‌ణ త‌ర్వాత‌ 1109 డాక్యుమెంట్ల‌కు సంబంధించి సుమారు నాలుగు కోట్ల రూపాయిలు ప్ర‌భుత్వానికి చెల్లింపు జ‌రగ‌లేద‌ని క‌మిటీ స‌భ్యులు మంత్రికి వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ…. ధ‌ర‌ణి పోర్ట‌ల్ లోని లొసుగుల‌ను ఆస‌రాగా చేసుకొని కొంత‌మంది అక్ర‌మాల‌కు పాల్ప‌డితే భూ భార‌తి పోర్ట‌ల్ ద్వారా ఆడిట్ నిర్వ‌హించి అక్ర‌మాల‌ను గుర్తించి త‌క్ష‌ణ‌మే ఉన్న‌త‌స్ధాయి క‌మిటీని ఏర్పాటు చేసి విచార‌ణ చేప‌ట్టామ‌ని తెలిపారు. ఇందుకు సంబంధించి తొమ్మిది జిల్లాల్లోని 35 మండ‌లాల్లో అక్రమాల‌కు పాల్ప‌డిన 48 మందిపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు.

వాస్త‌వ ప‌రిస్దితి ఇలా ఉంటే ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఓ నాయ‌కుడు వెయ్యి కోట్ల అవినీతి అని, మ‌రో నాయ‌కుడు ప‌దివేల కోట్లు అని ఇంకొక్క‌రు భూభార‌తి పోర్ట‌ల్ అవినీతిమ‌యమ‌ని నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More