పాలనను మరింత సులభతరం చేస్తూ.. ప్రభుత్వ సేవలను పౌరుల చెంతకే చేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక అడుగు వేసింది. ఇకపై ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలు, ఇతర సర్వీసుల కోసం మీ సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దకే మీ సేవ సర్వీసులు కార్యక్రమాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు.

హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దీనికి సంబంధించిన అధికారిక పోర్టల్‌ను మంత్రి లాంఛనంగా ఆవిష్కరించారు.
ఇంటి వద్దనే మీ సేవ సేవలు పొందడానికి ప్రభుత్వం రెండు అత్యంత సులువైన మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. పౌరులు నేరుగా 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ మీ సేవ పోర్టల్ ద్వారా తమకు అనుకూలమైన సమయానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
ఈ రెండు విధానాల్లో ఏదైనా ఒక విధంగా మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ పూర్తయిన వెంటనే, కేటాయించిన సమయానికి మీ సేవ ఎగ్జిక్యూటివ్ నేరుగా మీ ఇంటికే వచ్చి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ డోర్ డెలివరీ విధానం ద్వారా నిత్యం ప్రజలకు అవసరమయ్యే కీలకమైన పత్రాలు, సేవలు అందించనున్నారు.
కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ప్రమాణ పత్రం. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఈసీ కాపీలు, పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ పౌర సేవలు, ఇతర ముఖ్యమైన అప్లికేషన్లు అందించనున్నట్టుగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు.
ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందుకోసం 70 మందికి పైగా మీ సేవ ఏజెంట్లు, విలేజ్ లెవల్ ఎంటర్ప్రెన్యూర్లకు ప్రత్యేక శిక్షణనిచ్చినట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
{{/usCountry}}ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందుకోసం 70 మందికి పైగా మీ సేవ ఏజెంట్లు, విలేజ్ లెవల్ ఎంటర్ప్రెన్యూర్లకు ప్రత్యేక శిక్షణనిచ్చినట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
{{/usCountry}}ఈ పథకాన్ని ప్రాథమికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజా స్పందనను బట్టి ఈ డోర్ డెలివరీ సర్వీసులను తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ నూతన విధానం వల్ల వృద్ధులు, దివ్యాంగులు, ఉద్యోగులకు తీవ్ర శ్రమ తగ్గడమే కాకుండా పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.
'గుడ్ గవర్నెన్స్‌కు టెక్నాలజీని జోడించి డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం. పాలనకు టెక్నాలజీని జోడించి పారదర్శకత, జవాబుదారీతనం, సుపరిపాలనకు పెద్దపీట వేస్తున్నాం. మీ సేవా కేంద్రాల ద్వారా అందించే అన్న ముఖ్యమైన పౌర సేవలను ఇంటి దగ్గరే అందించేందుకు ఈరోజు బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో మీ సేవా డోర్ డెలివరీ సర్వీసెస్‌ను లాంఛనంగా ప్రారంభించాను. ఈ సేవలను తొలి దశలో క్యూర్ ఏరియాలో... ఆ తర్వాత రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.' అని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు.