పంట పెట్టుబడి సాయం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా స్కీమ్ పై ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. గతంలో మాదిరిగా కాకుండా…ఈసారి మరికొన్ని మార్పులు ఉండనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.

గతంలో సాగు యోగత్య ఉన్నా రైతు భరోసా స్కీమ్ కింద నిధులు జమ చేశారు. అయితే ఈసారి మాత్రం సాగు చేస్తున్న పంట భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.
శాటిలైట్ ఫొటోల క్రీడకరణ పూర్తి చేసి నివేదికను వెంటనే సమర్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నివేదిక వచ్చిన తర్వాతనే రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని చెప్పారు.
సాగు లేకపోతే నిధులు కట్…!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత… పంట పెట్టుబడి సాయం స్కీమ్ లో అనేక మార్పులు తీసుకొచ్చింది. గతంలో ఉన్న రైతుబంధు పేరును రైతు భరోసా స్కీమ్ గా మార్చింది. అన్ని రకాల భూములకు కాకుండా… కేవలం సాగు యోగత్య ఉన్న భూములకే డబ్బులు చేయటం షురూ చేసింది. ఇప్పటికే ఓ సారి ఆయా రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు వేసింది. అంతేకాకుండా వందల ఎకరాలు, రియల్ ఎస్టేట్ భూముల విషయంలోనూ జాగ్రత్తలు చేపట్టింది. తాజాగా సాగు చేస్తేనే డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది.
సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో…. 10 లక్షల ఎకరాలలోపు భూములకు రైతు భరోసా స్కీమ్ నిధులు ఆగిపోతావని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా అందిస్తోంది. గతంలో ఎకరానికి రూ.5 వేలు ఇచ్చేవారు.
{{/usCountry}}సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో…. 10 లక్షల ఎకరాలలోపు భూములకు రైతు భరోసా స్కీమ్ నిధులు ఆగిపోతావని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా అందిస్తోంది. గతంలో ఎకరానికి రూ.5 వేలు ఇచ్చేవారు.
{{/usCountry}}