మేం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం.. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కామెంట్స్
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వతిరేకిస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టును అన్ని రకాలుగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో చిట్ చాట్ చేశారు. ఈ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టులో వాదనలు బలంగా వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సూచించామని చెప్పారు.

'పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టులను మేం అన్ని ఫోరమ్‌లలో వ్యతిరేకిస్తున్నాం. మాజీ మంత్రి హరీశ్ రావు చూపిస్తున్న లేఖ ఈ ప్రాజెక్టులకు సంబంధించినది కాదు. పోలవరం-నల్లమల సాగర్ ఇంటర్ స్టేట్ రూల్స్‌కు వ్యతిరేకం అని జీఆర్ఎంబీ లేఖ రాశాం. మా అభిప్రాయాన్ని జీఆర్ఎంబీ కూడా సమర్థించింది.' అని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారు.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయని ఉత్తమ్ వెల్లడించారు. సుప్రీం కోర్టులో తెలంగాణ వాదనలను బలంగా వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సూచించామన్నారు. ఈ కేసును వచ్చే.. సోమవారానికి సుప్రీం కోర్టు వాయిదా వేసిందన్నారు. రిట్ పిటిషన్‌లో కాదని, సూట్ పిటిషన్‌లో రావాలని తమకు సుప్రీం కోర్టు సూచించిందన్నారు. ఈ కేసుకు సంబంధించి స్టే ఇవ్వాలని సుప్రీం కోర్టును వచ్చే సోమవారం కోరుతామని ఉత్తమ్ స్పష్టం చేశారు. వచ్చే విచారణకు తాను కూడా ప్రత్యక్షంగా హాజరు అవుతానని స్పష్టం చేశారు.
'ఒకటి, రెండు రోజుల్లో మరోసారి న్యాయవాదులతో సమావేశం అవుతాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేశాం. గతంలో ఈ పథకం ఆగిపోయి ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు. మా ఒత్తిడి వలనే ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపేసింది. బీఆర్ఎస్ హయాంలో కృష్ణ-గోదావరి జలాల్లో తెలివి ఎక్కువ.. పని తక్కువ. అతి తెలివితో బీఆర్ఎస్ తెలంగాణకు భారీగా నష్టం చేసింది. కేసీఆర్ హయాంలో పాలమూరు-రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి, తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు కాళేశ్వరాన్ని మార్చి నష్టం చేశారు.' అని ఉత్తమ్ పేర్కొన్నారు.
భారతీయ విద్యా భవన్‌పై విచారణ
మరోవైపు జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యా భవన్ విద్యా సంస్థపై అసెంబ్లీలో చర్చకు వచ్చింది. సంస్థ ఏకస్వామ్యంగా వ్యవహరిస్తోందని, ఎస్సీ, ఎస్టీ వర్గాల పాఠశాల విద్యార్థులకు వారి కోటా ప్రకారం సీట్లు కేటాయించడంలో విఫలమైందని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు.
జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యా భవన్ విద్యా సంస్థలో అడ్మిషన్ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి, తదనుగుణంగా చర్యలు తీసుకుంటుందని మంత్రి దామోదర్ రాజ నరసింహ హామీ ఇచ్చారు. భారతీయ విద్యా భవన్ గుత్తాధిపత్యం వహించడం, ఎస్సీ, ఎస్టీ వర్గాల పాఠశాల విద్యార్థులకు వారి కోటా ప్రకారం సీట్లు కేటాయింపుపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


