MJPTBCWREIS Results 2026 : తెలంగాణ రాష్ట్ర బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (MJPTBCWREIS) ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా మొదటి దశ (First Phase) సీట్ల కేటాయింపు ఫలితాలను సొసైటీ కార్యదర్శి శ్రీ బడుగు సైదులు (IFS) ఆదివారం అధికారికంగా విడుదల చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల్లో జూనియర్ ఇంటర్మీడియట్ (RJC) మరియు డిగ్రీ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో ఆ వివరాలను ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఈ ఏడాది ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా…. కేవలం విద్యార్థులు తమ పదో తరగతి (SSC) లో సాధించిన మార్కుల (మెరిట్) ఆధారంగానే ఇంటర్మీడియట్ సీట్లను కేటాయించినట్లు కార్యదర్శి స్పష్టం చేశారు. అలాగే డిగ్రీ సీట్లను కూడా ఇంటర్ మార్కుల ఆధారంగా కేటాయించడం జరిగింది.
ఫలితాలు ఎక్కడ చెక్ చేసుకోవాలంటే..?
- ఇంటర్మీడియట్ ఫలితాల కోసం అభ్యర్థులు: https://mjptbcwreis.telangana.gov.in (లేదా) https://mjptbcadmissions.org/MJP-Inter వెబ్‌సైట్లను సందర్శించాలి.
- డిగ్రీ కాలేజీ అడ్మిషన్ల ఫలితాల కోసం : https://mjptbcadmissions.org/MJP-Degree/ వెబ్‌సైట్ ద్వారా సీట్ల కేటాయింపు వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రిపోర్టింగ్ గడువు…
మొదటి విడత ఫలితాలలో సీట్లు దక్కించుకున్న విద్యార్థులకు అడ్మిషన్ల గడువును కూడా అధికారులు ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థులు తమకు కేటాయించిన సీట్లను ఖరారు చేసుకోవడానికి అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను (విద్యార్హత పత్రాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తదితర డాక్యుమెంట్లు) సిద్ధం చేసుకోవాలి.
ఆయా పత్రాలతో ఈనెల 25 (మే 25) నుంచి మే 30వ తేదీ లోపు సంబంధిత కాలేజీలకు నేరుగా వెళ్లి ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రవేశాలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా లేదా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా అభ్యర్థులు కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్ 040-23328266 లో సంప్రదించవచ్చని కార్యదర్శి బడుగు సైదులు సూచించారు.