Telangana Govt Fertilizer App : వ్యవసాయ రంగంలో సాంకేతికతను జోడించి…. ఎరువుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘రాష్ట్ర ఫెర్టిలైజర్ యాప్’ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యాప్ విధానం ద్వారానే రైతులకు ఎరువులను పంపిణీ చేస్తున్నారు.

ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ యాప్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో ఈ డిజిటల్ వ్యవస్థ దేశానికే దిక్సూచిగా నిలిచిందని చెప్పారు. తెలంగాణ సర్కారు చేపట్టిన ఈ వినూత్న ప్రయోగం ఇతర రాష్ట్రాలను సైతం ఎంతగానో ఆకర్షిస్తోందన్నారు. ఈ ఫెర్టిలైజర్ యాప్ పనితీరును పొరుగు రాష్ట్రాల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారని తెలిపారు.
యాప్ లో మరిన్ని మార్పులు…
రైతాంగం నుంచి వచ్చిన విలువైన సూచనలు, క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా రాష్ట్ర ఫెర్టిలైజర్ యాప్‌లో ప్రభుత్వం మరిన్ని మార్పులు, చేర్పులు చేసింది. యాప్‌ను రైతులకు మరింత సులభంగా మార్చేందుకు కింది సదుపాయాలను కొత్తగా చేర్చారు.
- జిల్లా వారీగా డీలర్ల స్టాక్ నిర్ధారణ కోసం ప్రత్యేక షెడ్యూలింగ్ వ్యవస్థ.
- మండలాల వారీగా లభ్యతను సులభంగా చూపే మండల మ్యాపింగ్ సదుపాయం.
- స్మార్ట్‌ఫోన్ లేని రైతుల కోసం మీసేవా కేంద్రాల ద్వారా మరియు టెలిఫోన్ ద్వారా ఎరువుల బుకింగ్ చేసుకునే సౌకర్యం.
- రైతుల సందేహాలను సకాలంలో నివృత్తి చేసేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ విభాగం.
ఈ సరికొత్త మార్పుల వల్ల రైతులకు ఎరువుల కొనుగోలు ప్రక్రియ మరింత సులభతరం కానుంది. రైతులు ఇళ్ల వద్ద నుంచే ఏ డీలర్ వద్ద ఎంత స్టాక్ ఉందో తమ మొబైల్ ఫోన్లలోనే చూసుకోవచ్చు. దీనివల్ల ఒక దుకాణం నుంచి మరో దుకాణానికి తిరిగే తిప్పలు తప్పడమే కాకుండా, ఎరువుల డిపోల వద్ద గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా పోయింది.
{{/usCountry}}ఈ సరికొత్త మార్పుల వల్ల రైతులకు ఎరువుల కొనుగోలు ప్రక్రియ మరింత సులభతరం కానుంది. రైతులు ఇళ్ల వద్ద నుంచే ఏ డీలర్ వద్ద ఎంత స్టాక్ ఉందో తమ మొబైల్ ఫోన్లలోనే చూసుకోవచ్చు. దీనివల్ల ఒక దుకాణం నుంచి మరో దుకాణానికి తిరిగే తిప్పలు తప్పడమే కాకుండా, ఎరువుల డిపోల వద్ద గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా పోయింది.
{{/usCountry}}గతంలో ఎరువుల డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో కొందరు మధ్యవర్తులు సరుకును పక్కదారి పట్టించి కృత్రిమ కొరత సృష్టించేవారు. కానీ…. ఈ డిజిటల్ యాప్ అందుబాటులోకి వచ్చాక ప్రతి లీటరు, ప్రతి బస్తా ఎరువుల కదలికలపై నిరంతర నిఘా ఉంటోంది. దీంతో ప్రతి దశలోనూ పారదర్శకత పెరిగి, పంపిణీ వ్యవస్థ ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది. రైతులకు న్యాయంగా…. సకాలంలో ఎరువులు అందించడమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
“ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన యూరియా సరఫరా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో నిరంతరం సమన్వయం చేసుకుంటోంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జె.పి. నడ్డాకు రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు లేఖలు రాసింది. ప్రభుత్వం చేసిన గట్టి ప్రయత్నాల వల్ల ఇప్పటికే రాష్ట్రానికి 3.89 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా విజయవంతంగా చేరింది. జూన్ నెలాఖరు నాటికి రావలసిన మిగిలిన కోటాను కూడా సకాలంలో రప్పించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు” అని మంత్రి తుమ్మల వివరించారు.