నువ్వా? నేనా? సర్పంచ్ ఎన్నికల బరిలో అత్తాకోడళ్లు.. ఆసక్తిగా పంచాయతీ ఫైట్!
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు ఆసక్తిగా మారింది. ఒకే కుటుంబంలోని వ్యక్తులు చాలా చోట్ల నామినేషన్లు వేశారు. దీంతో ఊర్లలో పంచాయతీ ఫైట్ రసవత్తరంగా మారింది.
తెలంగాణలో పంచాయతీ ఫైట్ ఆసక్తిగా మారుతోంది. రోజురోజుకు లోకల్‌గా ఎత్తుగడలు వేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. వాడవాడకు మీటింగ్స్ పెడుతున్నారు. కమ్యునిటీలవారిగా చర్చలు జరుపుతున్నారు. ఊర్లలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకే కుటుంబంలోని వ్యక్తులు కూడా నామినేషన్లు వేయడంతో మరింత ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఇంట్లోని ఏ వ్యక్తి గెలుస్తారా? అని చాలా ఊర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

అత్తాకోడళ్ల ఫైట్
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ఘన్‌శ్యామ్‌దాస్ (జీడీ) నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి అత్తాకోడళ్లు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆ స్థానాన్ని మహిళకు రిజర్వ్ చేశారు. మాజీ సర్పంచ్ సూర సమ్మయ్య ఆదివారం తన తల్లి సూర నర్సమ్మ తరపున నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం ఆయన అన్న భార్య అంటే వదిన సూర రమాదేవి కూడా నామినేషన్ పత్రాలను సమర్పించారు. దీనితో ఒకే ఇంటి నుండి ఇద్దరు మహిళలు ఒకే స్థానానికి ఎన్నికల రేసులో ఉన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఏమాయికుంటకు చెందిన జాదవ్ కిషన్, దేవ్‌కబాయి దంపతులకు ప్రతాప్ సింగ్, కుబేర్ సింగ్, అనార్ సింగ్, రామ్‌లఖన్ సింగ్ నలుగురు కుమారులు ఉన్నారు. గతంలో జాదవ్ కిషన్ ఒకసారి సర్పంచ్‌గా చేశారు. దేవ్‌కబాయి కూడా సర్పంచ్‌గా గెలిచారు. తండ్రి మరణం తర్వాత నాలుగో కుమారుడు లఖన్‌సింగ్ కిందటి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు.
ప్రస్తుత ఎన్నికల్లో సైతం రిజర్వేషన్ వారికి అనుకూలంగా వచ్చింది. అయితే ఇప్పుడు అన్నదమ్ములు జాదవ్ కుబేర్ సింగ్, అనార్ సింగ్ కూడా సర్పంచ్ బరిలో దిగారు. నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు ఇదే మండలంలోని హీరాపూర్ గ్రామపంచాయతీలో అత్తాకోడళ్లు తొడసం లక్ష్మీబాయి, తొడసం మహేశ్వరి సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వేశారు.
బరిలో తండ్రీకొడుకులు
మెదక్ జిల్లాలోనూ ఆసక్తికర పోరు నెలకొంది. తండ్రీకొడుకులు సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో సర్పంచ్ స్థానానికి తండ్రి మానెగళ్ళ రామకృష్ణయ్య నామినేషన్ వేశాడు. అయితే ఆయన కుమారుడు వెంకటేశ్ కూడా అదే స్థానానికి ప్రత్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో పోరు ఆసక్తిగా మారింది.
తెలంగాణలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో ఇలాంటి ఆసక్తికర విషయాలు చాలా జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేలం పాటలో సర్పంచ్ స్థానాన్ని కొనుక్కుంటున్నారు. ఏకగ్రీవం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఒకే కుటుంబంలో అనేక మంది కూడా పంచాయతీ ఫైట్‌లో ఉండటంతో పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


