TG MPTC ZPTC Elections : త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు..!
రాష్ట్రంలో త్వరలోనే ప్రాదేశిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈనెల 23వ తేదీన జరగబోయే కేబినెట్ భేటీలో ఈ విషయంపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఇక ప్రాదేశిక ఎన్నికలు(ఎంపీటీసీ, జెడ్పీటీసీ) జరగాల్సి ఉంది. సర్పంచ్ ఎన్నికలు పూర్తి కాగానే వెంటనే ఈ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ కుదరలేదు. ముందుగా మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించగా… ఇటీవలనే ప్రక్రియ పూర్తి అయింది. ఈ నేపథ్యంలో ప్రాదేశిక ఎన్నికలను కూడా పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది.

ఇక గతేడాదిలోనే జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 31 జడ్పీ స్థానాలు, 566 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు ఉన్నట్లు తెలిపింది. 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు ప్రకటించింది. ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది.
త్వరలోనే ఎన్నికలు…!
స్థానిక ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పాగా వేసిన కాంగ్రెస్ సర్కార్… అదే జోష్‌తో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వాలని చూస్తోంది. రిజర్వేషన్ల ఖరారుతో పాటు ఎన్నికల నిర్వహణ ప్రక్రియను కేవలం 15 నుంచి 20 రోజుల్లోనే పూర్తి చేయాలని చూస్తోంది. కేవలం ఒక్క విడతలోనే నిర్వహించాలని భావిస్తోంది.
ఈనెల 23 కేబినెట్ భేటీ…
ఈనెల 23న రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మంత్రుల అభిప్రాయాలను సేకరించి…. ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దాదాపు ఈ భేటీలో ఈ ఎన్నికలపై ఓ క్లారిటీ వచ్చే సూచనలున్నాయి.
ఇక రాష్ట్రంలో ఇంటర్, పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల నిర్వహణ సాధ్యసాధ్యాలను పరిశీలించనున్నారు. ఇదే విషయంపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. పరీక్షలకు ఆటంకం కలగకుండా పోలింగ్ తేదీలను ఎలా ఖరారు చేయాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే ఛాన్స్ ఉంది.
పరీక్షలకు ఇబ్బందులు లేకుండానే మార్చిలోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 15 వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోనుంది. మొత్తంగా చూస్తే ఈనెల 23వ తేదీన జరగిే కేబినెట్ భేటీ ద్వారా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఓ క్లారిటీ రాబోతుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

