నల్లమల అడవుల్లో కొలువైన సలేశ్వర క్షేత్రం ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు జాతర తేదీలు ఖరారయ్యాయి. ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమయ్యే ఈ జాతర… ఏప్రిల్ 6వ తేదీతో ముగియనుంది. ఈ మేరకు అధికారులు, పోలీసులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణ అమర్‌నాథ్ యాత్రగా….

'తెలంగాణ అమర్‌నాథ్' యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కృష్ణానది నుంచి జాలువారే జలపాతాల అలలతో పాటు అటవీ అందాలను వీక్షిస్తూ… యాత్ర ముందుకు సాగుతోంది. ఎత్తైన కొండల నడుమ వెయ్యడుగుల లోయలో కొలువైన పురాతన సలేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఎంతో ఉత్సాహంగా వెళ్తుంటారు. ‘వస్తున్నాం… వస్తున్నాం లింగమయ్య’ అంటూ నినాదాలు చేస్తుంటారు.
ఎలా చేరుకోవాలంటే…?
ఈ జాతరకు వచ్చే భక్తులను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అడవిలోకి అనుమతి ఇస్తారు. ప్రతి ఏడాది ఓసారి ఇక్కడ జాతర జరుగుతోంది. ఈ జాతర ఉగాది వెళ్లిత తర్వాత తొలిచైత్రపౌర్ణమికి మొదలౌతుంది. ఇది నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవులలో ఉంటుంది. శ్రీ శైలం – హైదరాబాద్ వెళ్లే రహదారిలో శ్రీశైలం అటవీ ప్రాంతంలో శ్రీశైలం దారినుండి పక్కదారిలో ఫరహబాద్ నుంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.
శ్రీశైలనికి 60 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అడవిలో నుంచి ఫరహబాద్ మీదుగా 30 కిలో మీటర్ల వరకు వాహన ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఇందులో 30 కిలో మీటర్లు వాహన ప్రయాణం…. అక్కడ్నుంచి నుంచి 5 కిలో మీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది.
ఈ సలేశ్వర క్షేత్రంలో ఈశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. ప్రతి ఏడాది 3 రోజులు మాత్రమే ఈ అడవిలోకి అనుమతి ఉంటుంది. హైదరాబాద్ నుండి వచ్చేవారు 130 కి.మీ. జర్నీ చేయాల్సి ఉంటుంది. ప్రకృతి ఒడిలో సాగే ఈ అద్భుతమైన జాతరకు ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడి జలపాతంలో ఉండే నీటికి ఔషధ గుణాలు ఉంటాయని భక్తులు నమ్ముతారు. బాటిల్స్ లో ప్రత్యేకంగా తీసుకెళ్తుంటారు.
{{/usCountry}}ఈ సలేశ్వర క్షేత్రంలో ఈశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. ప్రతి ఏడాది 3 రోజులు మాత్రమే ఈ అడవిలోకి అనుమతి ఉంటుంది. హైదరాబాద్ నుండి వచ్చేవారు 130 కి.మీ. జర్నీ చేయాల్సి ఉంటుంది. ప్రకృతి ఒడిలో సాగే ఈ అద్భుతమైన జాతరకు ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడి జలపాతంలో ఉండే నీటికి ఔషధ గుణాలు ఉంటాయని భక్తులు నమ్ముతారు. బాటిల్స్ లో ప్రత్యేకంగా తీసుకెళ్తుంటారు.
{{/usCountry}}ఈ జాతరకు వచ్చే భక్తులు ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. కర్రల సాయంతో ముందుకెళ్లాలి. స్థానిక చెంచులే ఇక్కడ పూజారులుగా వ్యవహరిస్తారు. సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులు అటవీ పరిసరప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకం, బీడీ, చుట్ట, సిగరేట్ కాల్చడాన్ని పూర్తిగా నిషేధించారు.