Samantha Ugadi: ఉగాది పచ్చడి చేయడం ఎలా.. సమంతను చూసి నేర్చుకుంటారా? లైవ్‌లోనే భర్తను అలా పిలిచి షాకిచ్చిన సామ్

Samantha Ugadi: సమంత ఉగాది పచ్చడి ఎలా చేసిందో చూశారా? యాంకర్ సుమ, డైరెక్టర్ నందిని రెడ్డితో కలిసి ఆమె చేసిన వీడియో వైరల్ అవుతోంది. మా ఇంటి బంగారం మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆమె ఉగాది పచ్చడి తయారు చేయడం ఎలా అంటూ ఈ వీడియోను రిలీజ్ చేసింది.

Published on: Mar 19, 2026, 17:37:52 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సమంత రూత్ ప్రభు రెండో పెళ్లి తర్వాత తన భర్త రాజ్ నిడిమోరు ఇంట్లో తొలి ఉగాదిని జరుపుకుంటోంది. అయితే ఈ సందర్భంగా తన నెక్ట్స్ మూవీ మా ఇంటి బంగారం ప్రమోషన్లు కూడా నిర్వహిస్తూ.. ఉగాది పండగనాడు తాను పచ్చడి చేసే వీడియోను షేర్ చేసింది. దీనిని తయారు చేయడంలో యాంకర్ సుమ, డైరెక్టర్ నందిని రెడ్డి ఆమెకు సాయం చేయడం ఇందులో చూడొచ్చు.

Samantha Ugadi: ఉగాది పచ్చడి చేయడం ఎలా.. సమంతను చూసి నేర్చుకుంటారా? లైవ్‌లోనే భర్తను అలా పిలిచి షాకిచ్చిన సామ్
Samantha Ugadi: ఉగాది పచ్చడి చేయడం ఎలా.. సమంతను చూసి నేర్చుకుంటారా? లైవ్‌లోనే భర్తను అలా పిలిచి షాకిచ్చిన సామ్

సమంత ఉగాది పచ్చడి

సమంత ఈ వీడియో మొదట్లోనే ఉగాది పచ్చడి ఎలా చేయాలో తెలియక తికమకపడుతుంది. మా ఇంటి బంగారం మూవీ డైరెక్టర్ నందిని రెడ్డిని పిలుస్తుంది. ఆమెకు కూడా అది తెలియకపోవడంతో యాంకర్ సుమకు ఫోన్ చేస్తుంది. ఆమె తనదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చి.. చకాచకా ఆ ఇద్దరి చేత ఉగాది పచ్చడి చేయిస్తుంది. పనిలోపనిగా మా ఇంటి బంగారం మూవీ ప్రమోషన్లు కూడా చేసేశారు.

రాజ్‌ను బాబు అని పిలుస్తూ..

ఉగాది పచ్చడి చేయడం పూర్తయ్యాక సమంత తన భర్త రాజ్ నిడిమోరుకు వీడియో కాల్ చేస్తుంది. హాయ్ బాబు అంటూ ఆమె పిలవడం చూసి పక్కనే ఉన్న సుమ షాక్ తింటుంది. తాను ఉగాది పచ్చడి చేశానని సామ్ చెప్పడంతో నువ్వు చేశావా అని రాజ్ అడుగుతాడు. అది విని సుమ, నందిని పగలబడి నవ్వుతారు. ఆ తర్వాత సమంత ఉగాది పచ్చడిని అందరూ టేస్ట్ చేస్తారు. ఉగాది పచ్చడి చేయడం ఎలా అంటూ ఈ వీడియోను సమంత ప్రొడక్షన్ హౌజ్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ షేర్ చేసింది.

మా ఇంటి బంగారం రిలీజ్ డేట్

కొంత కాలం గ్యాప్ తర్వాత సమంత తెలుగులో హీరోయిన్ గా చేస్తున్న మూవీ ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా రిలీజ్ డేట్ ను గతంలోనే అనౌన్స్ చేశారు. వేసవి కానుకంగా ఈ సినిమా మే 15, 2026న థియేటర్లలోకి రాబోతుందని ప్రకటించారు.

సమంత హీరోయిన్ గా నటించడమే కాకుండా మా ఇంటి బంగారం మూవీకి ఆమెనే నిర్మాత కూడా. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ సినిమాకు సమంత భర్త రాజ్ నిడిమోరు కథ అందంచాడు. మా ఇంటి బంగారం సినిమాకు నందిని రెడ్డి డైరెక్టర్.

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్

ఇప్పటికే మా ఇంటి బంగారం మూవీ టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ను బట్టి చూస్తే ఈ సినిమా ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. ఈ మూవీలో సమంత రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తోంది.

ఓ వైపు ఇంట్లో కోడలిగా పద్ధతిగా ఉండే సామ్.. బయట యాక్షన్ తో గూండాల పని పడుతుంది. అమాయకంగా నటిస్తూనే ఫైటింగ్ సీన్స్ లో యాక్షన్ మోడ్ లోకి సమంత వెళ్లిపోయింది. మా ఇంటి బంగారం మూవీ సమంతకు మంచి కమ్ బ్యాక్ అవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More