తెలంగాణ రాష్ట్రాన్ని దేశీయ, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం సరికొత్త పర్యాటక అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. కొత్త పర్యాటక ప్రాంతాల గుర్తింపు, సందర్శకులకు అంతర్జాతీయ స్థాయి వసతుల కల్పన, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, రుచులు, హస్తకళలు, జానపద కళలు, అద్భుతమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు గ్రాండ్ టూరిజం కార్నివాల్ నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దుబాయ్‌లోని ప్రసిద్ధ 'గ్లోబల్ విలేజ్' స్ఫూర్తితో ఈ కార్నివాల్‌ను ప్రతి ఏటా ఒక మహా ఈవెంట్‌లా నిర్వహించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షించాలని ప్రణాళికలు వేస్తోంది.
భాగ్యనగరానికి వచ్చే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు నైట్ టూరిజం, హెరిటేజ్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించారు. పుట్లిబౌలి, కోఠి, చార్మినార్, లాడ్ బజార్ ప్రాంతాలలో హెరిటేజ్ వాక్స్ నిర్వహిస్తారు. నైట్ బజార్లు, అత్యాధునిక సౌండ్ అండ్ లైట్ షోలను ఏర్పాటు చేస్తారు. నగరంలోని చారిత్రాత్మక మెట్ల బావుల విశిష్టతను చాటేలా ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. ప్రత్యేక సిటీ టూర్ బస్సులు, వింటేజ్ కార్ల మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు.
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అమ్రాబాద్, కవాల్ టైగర్ రిజర్వ్ అడవుల్లో ఎకో టూరిజంను భారీగా విస్తరించనున్నారు. కర్ణాటకలోని ప్రసిద్ధ బండీపూర్ వన్యప్రాణి పర్యాటక నమూనాను అధికారులు అధ్యయనం చేయనున్నారు. చెంచు గిరిజనుల సంస్కృతి, కాకతీయుల వారసత్వ ప్రాంతాలు, ట్రెకింగ్ వంటి వాటిని ఈ ఎకో టూరిజంలో భాగం చేయనున్నారు.
మరోవైపు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సోమశిల వద్ద దాదాపు 1,600 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ వాటర్‌ఫ్రంట్ టూరిజం, లగ్జరీ హోటళ్లు, వినోద వేదికలు, డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికలు, ఆధునిక పర్యాటక మౌలిక వసతులను కల్పించి భారీగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్థానికులకు ఉపాధి కల్పించనున్నారు.
{{/usCountry}}మరోవైపు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సోమశిల వద్ద దాదాపు 1,600 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ వాటర్‌ఫ్రంట్ టూరిజం, లగ్జరీ హోటళ్లు, వినోద వేదికలు, డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికలు, ఆధునిక పర్యాటక మౌలిక వసతులను కల్పించి భారీగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్థానికులకు ఉపాధి కల్పించనున్నారు.
{{/usCountry}}యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయం వద్ద పర్యాటక కేఫెటేరియాను పునరుద్ధరించనున్నారు. అలాగే హైదరాబాద్‌లోని సంజీవయ్య పార్క్‌లో సరికొత్త వినోద కార్యక్రమాలను ప్రవేశపెట్టనున్నారు. పర్యాటకులకు సరైన సమాచారం అందించేందుకు వీలుగా టూర్ గైడ్‌ల కోసం ప్రత్యేక శిక్షణ, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు.
పర్యాటక రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వ ఆస్తుల రక్షణ, పర్యాటక ప్రాంతాల సముచిత నిర్వహణ, క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు పర్యవేక్షణను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.