మిడిల్ క్లాస్ బడ్జెట్‌లో పుష్కర స్నానం, కాళేశ్వర ముక్తేశ్వరుడి దర్శనం, రామప్ప టూర్!
కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలకు వెళ్లాలనుకుంటున్నారా? దీంతోపాటుగా మరికొన్ని పర్యాటక ప్రదేశాలను సందర్శించి రావొచ్చు. ఇందుకోసం టూరిజం కార్పొరేషన్ ప్లాన్ చేసింది.
కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాల వేళ పుణ్యస్నానాలు ఆచరించాలనుకునే భక్తులకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ అద్భుతమైన అవకాశం కల్పించింది. హైదరాబాద్ నుండి కాళేశ్వరానికి ప్రత్యేక ఏసీ బస్సుల ద్వారా ‘కాళేశ్వరం ప్యాకేజీ టూర్లను’ అధికారికంగా ప్రకటించింది.

ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా భక్తులు పవిత్ర పుష్కర స్నానం ఆచరించడంతో పాటు, స్వయంభూ శ్రీ ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. అంతేకాదు, యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని కూడా సందర్శించేలా ఈ రూట్ మ్యాప్‌ను డిజైన్ చేశారు. భక్తుల బడ్జెట్, సౌకర్యాలకు అనుగుణంగా టూరిజం కార్పొరేషన్ రెండు రకాల ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది.
ప్రయాణికుల సౌకర్యార్థం అధునాతన ఏసీ బస్సులను కేటాయించారు. సీట్ల రకాన్ని బట్టి ధరలు ఉన్నాయి: ఏసీ హైటెక్ స్లీపర్ కోచ్ (30 సీట్లు) పెద్దలకు టికెట్ ధర రూ. 3,600. పిల్లలకు రూ. 2,880గా నిర్ణయించారు. ఇక ఏసీ మినీ కోచ్ (21 సీట్లు)పెద్దలకైతే.. రూ. 2,800 కాగా పిల్లలకు రూ. 2,240గా ధర ఉంది. ఈ ప్యాకేజీ టూర్ కేవలం ఒకే రోజులో ముగిసేలా పక్కా ప్రణాళికతో రూపొందించారు.
టూర్ ప్లాన్
మొదటి రోజు రాత్రి (8:30 PM): హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ గల సీఆర్వో (CRO) ఆఫీస్ నుండి ప్రత్యేక ఏసీ బస్సు బయలుదేరుతుంది.
రెండో రోజు ఉదయం (5:00 AM): కాళేశ్వరం చేరుకుంటారు. అక్కడ గోదావరి, ప్రాణహిత నదుల సంగమ క్షేత్రంలో పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించవచ్చు. (కాళేశ్వరం దక్షిణ గంగగా పిలిచే గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహిణిగా (భూగర్భంలో) ప్రవహించే సరస్వతీ నది కలయికతో ఏర్పడిన మహా పవిత్ర క్షేత్రం (త్రివేణీ సంగమం). భారతదేశంలో సరస్వతీ నది అంతర్వాహిణిగా ఉన్న క్షేత్రాలు రెండే రెండు: ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) – ఇక్కడ కుంభమేళా జరుగుతుంది. తెలంగాణలోని కాళేశ్వరం-ఇక్కడ పుష్కరాలు జరుగుతాయి.)
ఉదయం (దర్శనాలు): స్నానానంతరం యమధర్మరాజు శాపవిమోచనం పొందిన క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన, ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండే శ్రీ ముక్తేశ్వర స్వామి వారిని భక్తులు దర్శించుకుంటారు.
మధ్యాహ్నం (2:00 PM): కాళేశ్వరంలో భోజన విరామం ముగించుకుని, బస్సు పాలంపేటలోని రామప్ప గుడికి బయలుదేరుతుంది. అక్కడ కాకతీయుల అద్భుత శిల్పకళా సంపదను వీక్షించవచ్చు.
రాత్రి (10:00 PM): రామప్ప సందర్శన అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమై రాత్రి 10 గంటలకు నగరానికి చేరుకుంటారు.
టికెట్ల బుకింగ్ కోసం సంప్రదించాల్సిన నంబర్లు
పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నందున భక్తులు ముందస్తుగా బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
- ఫోన్ నంబర్లు: 040-29801040, 040-27893100
- టోల్ ఫ్రీ నంబర్: 1800-4254-5454
- వాట్సాప్ బుకింగ్: 9848540371
పుష్కరాల ప్రాముఖ్యత: నదీ తీరంలో అంత్య పుష్కరాల సమయంలో స్నానం చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా పితృదేవతలకు పిండప్రదానాలు చేయడానికి ఈ సమయం ఎంతో అనుకూలమైనది.
యాత్రికులకు టిప్స్: ఎండల తీవ్రత దృష్ట్యా ప్రయాణికులు కాటన్ దుస్తులు ధరించడం మంచిది. పుష్కర స్నానాల కోసం అదనపు దుస్తుల జతను, పూజా సామాగ్రిని వెంట తెచ్చుకోవాలి.
కార్పొరేషన్ ఏర్పాట్లు: పర్యాటక శాఖ గైడ్‌లు బస్సులోనే అందుబాటులో ఉండి భక్తులకు దర్శన సమయాల్లో సహాయం అందిస్తారు. కుటుంబ సమేతంగా, ఎలాంటి ప్రయాణ ఇబ్బందులు లేకుండా పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


