...
...
Next Story

విద్యార్థులకు ఏడాదికి రూ.12వేల స్కాలర్‌షిప్.. సెప్టెంబర్ 1 వరకు దరఖాస్తుకు అవకాశం

తెలంగాణ NMMS స్కాలర్‌షిప్ పరీక్ష అప్లికేషన్ గడువు పెంచింది ప్రభుత్వం. సెప్టెంబర్ 1 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.

Published on: Aug 24, 2026, 17:24:38 IST
Advertisement

తెలంగాణ రాష్ట్రంలోని 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక ప్రకటన విడుదల చేసింది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMSS) పరీక్ష 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ, పరీక్ష రుసుము చెల్లింపు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

స్కాలర్‌షిప్ అప్లికేషన్
స్కాలర్‌షిప్ అప్లికేషన్

ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె. లింగయ్య విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి, పరీక్ష రుసుము చెల్లించడానికి సెప్టెంబర్ 01, 2026 వరకు గడువు పొడిగించారు. ప్రభుత్వ, జెడ్పీ, పురపాలక, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ (12వ తరగతి) వరకు నెలకు రూ.1,000 చొప్పున (ఏడాదికి రూ.12,000) కేంద్ర ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్ అందుతుంది. దరఖాస్తు నమోదు, నిబంధనలు, పూర్తి వివరాల కోసం అభ్యర్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ పరీక్షల విభాగానికి చెందిన అధికారిక వెబ్‌సైట్ http://bse.telangana.gov.in ను సందర్శించవచ్చు.

ఈ గడువు పెంపునకు సంబంధించిన ఉత్తర్వుల ప్రతిని రాష్ట్రంలోని జిల్లాల విద్యాశాఖాధికారులు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్లకు తగిన చర్యల నిమిత్తం పంపించారు. అర్హులైన 8వ తరగతి విద్యార్థులు ఈ పొడిగించిన అవకాశాన్ని ఉపయోగించుకుని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న దరఖాస్తు ఫారాల ప్రింటెడ్ కాపీ, ఎన్ఆర్ (రెండు కాపీలు), ఎస్‌బిఐ కలెక్ట్ ఫీజు రసీదులను సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సంబంధిత జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 3వ తేదీగా నిర్ణయించారు. ప్రింటెడ్ దరఖాస్తు ఫారం, ఎన్ఆర్ తప్పనిసరిగా సంబంధిత ప్రధానోపాధ్యాయునితో ధృవీకరించబడాలి. బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రం, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వైద్య ధృవీకరణ పత్రం జతచేయాలి. లేదంటే వారిని జనరల్ అభ్యర్థులుగా పరిగణిస్తారు. అభ్యర్థులందరూ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని జతచేయాలి. లేకుంటే దరఖాస్తు రద్దు అవుతుంది.

మెంటల్ ఎబిలిటీ టెస్ట్(M.A.T) – 90 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు. విద్యా సామర్థ్య పరీక్ష (S.A.T) 7వ, 8వ తరగతుల సైన్స్, గణితం, సాంఘిక శాస్త్రాల నుండి 90 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.

ఈ లింక్ క్లిక్ చేసి అధికారిక వెబ్‌సైట్ వెళ్లండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe