తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సాధారణంగా ఇచ్చే రెండో శనివారం సెలవును రద్దు చేసింది. అందుకే జూలై 11వ తేదీని అన్ని పాఠశాలలకు పనిదినంగా ప్రకటించింది. పాఠశాలల పునఃప్రారంభాన్ని జూన్ 12 నుంచి జూన్ 15కు వాయిదా వేయడంతో కోల్పోయిన విద్యా సమయాన్ని భర్తీ చేయడమే విద్యాశాఖ లక్ష్యం. జూలై 11న పాఠశాలలకు సెలవు లేనందున ఈ రెండో శనివారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు యథావిధిగా పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది.

పాఠశాల విద్యా శాఖ జూన్ నెలలో వేసవి సెలవులను పొడిగించింది. విద్యా సంవత్సరం ప్రకారం పాఠశాలలు జూన్ 12న తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సంబంధిత వర్గాల విజ్ఞప్తుల కారణంగా జూన్ 13 రెండో శనివారం, జూన్ 14 ఆదివారం కావడంతో విద్యాశాఖ పాఠశాలల పునఃప్రారంభాన్ని జూన్ 15కు వాయిదా వేసింది.
పాఠశాలల పునఃప్రారంభం వాయిదా పడటం వలన కోల్పోయిన విద్యా సమయాన్ని భర్తీ చేయడానికి, 2026-27 విద్యా క్యాలెండర్ ప్రకారం నిర్దేశించిన బోధనా దినాలను కచ్చితంగా పాటించేలా చూసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే అన్ని పాఠశాలలకు జూలై 11వ తేదీ (రెండో శనివారం)ని పనిదినంగా ప్రకటించింది.
ఇక మరోవైపు ఏడు వామపక్ష విద్యార్థి సంఘాల కూటమి తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం(జులై 10) విద్యాసంస్థల బంద్‌కు పిలుపునివ్వడంతో, పలు విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్ఓ, ఏఐఎఫ్డీఎస్, ఏఐఎస్బీ, ఏఐపీఎస్‌యులతో కూడిన కూటమి.. ప్రభుత్వం 27,000 ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే పేరుతో 4,000 క్లస్టర్ క్యాంపస్‌లుగా కుదించాలని చూస్తోందని ఆరోపించింది. ఆ ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేసింది.
అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తికాల విద్యాశాఖ మంత్రిని నియమించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఎంఈఓ, డీఈఓ, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని లెఫ్ట్ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ల కింద రూ. 7,000 కోట్లను విడుదల చేయాలని పేర్కొన్నాయి.
{{/usCountry}}అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తికాల విద్యాశాఖ మంత్రిని నియమించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఎంఈఓ, డీఈఓ, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని లెఫ్ట్ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ల కింద రూ. 7,000 కోట్లను విడుదల చేయాలని పేర్కొన్నాయి.
{{/usCountry}}