...
...
Next Story

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు : నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం - అభ్యర్థి వద్ద ఉండాల్సిన పత్రాలివే

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ షురూ అయింది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. జనవరి 30వ తేదీతో ఈ గడువు పూర్తవుతుంది. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ ఉంటుంది.

Published on: Jan 28, 2026 02:51 PM IST
Advertisement

రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. దీంతో ఆసక్తి గల అభ్యర్థులు…కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ఈనెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

మున్సిపల్ ఎన్నికలు
మున్సిపల్ ఎన్నికలు

మరోవైపు ఫిబ్రవరి 3 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

పోలీసులు భారీ బందోబస్తు మధ్య నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు అర్హతలతో పాటు సంబంధిత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి… స్వీకరిస్తున్నారు.

  • నామినేషన్ల ప్రారంభం-28.01.2026(ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు).
  • నామినేషన్ల ముగింపు తేదీ-30.01.2026(సాయంత్రం 5:00 గంటల వరకు).
  • పోలింగ్ తేదీ-11.02.2026 (ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు).
  • ఓట్ల లెక్కింపు-13.02.2026 (ఉదయం 8:00 గంటల నుంచి ఉంటుంది. లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు).

అభ్యర్థి వద్ద ఉండాల్సి పత్రాలు:

  • నామినేషన్ ఫారమ్
  • అఫిడవిట్
  • జనన ధ్రువీకరణ పత్రం
  • ఓటర్ జాబితాలో పేరున్న సర్టిఫికెట్
  • ఇటీవలే తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ ,ఎస్టీ ,బీసీలకు మాత్రమే)
  • బ్యాంక్ ఖాతా
  • పాస్ పోర్టులు
  • ఆధార్ కార్డు
  • రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసే వారు బీ-ఫామ్‌ తీసుకొని రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి.
  • స్వతంత్ర అభ్యర్థులకు ఆ వార్డులోని 10 మంది ఓటర్ల ప్రతిపాదన తప్పనిసరి.
  • మున్సిపాలిటీ నుంచి బకాయి లేనట్టు రశీదు సమర్పించాల్సి ఉంటుంది.
  • మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.1,250, ఇతరులకు రూ.2,500 డిపాజిట్ రుసుంగా నిర్ణయించారు.
  • కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.2,500, ఇతరులకు రూ.5,000 డిపాజిట్ చెల్లించాలి.
  • ఇతర పత్రాలు

ఆస్తి పన్ను బకాయిలు చెల్లిస్తేనే నామినేషన్‌ వేయడానికి అవకాశం ఉంటుంది. పెండింగ్ ఉంటే నామినేషన్లను స్వీకరించరు. ఈ పన్ను చెల్లింపు ప్రక్రియలో నిర్లక్ష్యం వహించకుండా క్లియర్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe