Singareni Recruitment 2026 : సింగరేణిలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు - ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం

Singareni Internal Recruitment 2026 : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 50 నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

Published on: Jun 5, 2026, 14:32:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Singareni Internal Recruitment 2026 : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

సింగరేణిలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
సింగరేణిలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

నోటిఫికేషన్ ద్వారా నాన్ - ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పరిధిలోని పలు పారామెడికల్, టెక్నికల్ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 50 ఖాళీలున్నాయి. సంస్థలో ఇప్పటికే పనిచేస్తూ…. నిర్దేశిత అర్హతలు కలిగి ఉన్న అంతర్గత అభ్యర్థులకు (Internal Candidates) మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. సంబంధిత హార్డ్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. జూన్ 16వ తేదీ సాయంత్రం 05:00 గంటల వరకు సమయం ఉంటుంది. అభ్యర్థులు http://www.scclmines.com/internal లింక్ ద్వారా ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

ఖాళీల వివరాలు :

  • ఫార్మాసిస్ట్ (T&S గ్రేడ్-D): 19 పోస్టులు
  • జూనియర్ టెక్నీషియన్ - ల్యాబ్ (Tఅండ్S గ్రేడ్-D): 15 పోస్టులు
  • జూనియర్ టెక్నీషియన్ - ఎక్స్-రే (T&S గ్రేడ్-D): 06 పోస్టులు
  • ఈసీజీ/2డీ ఎకో/టీఎంటీ/హోల్టర్ టెక్నీషియన్ (Tఅండ్ S గ్రేడ్-D): 03 పోస్టులు
  • ఫిజియోథెరపిస్ట్ (T&S గ్రేడ్-B): 02 పోస్టులు
  • డైటీషియన్ (T అండ్ S గ్రేడ్-B): 02 పోస్టులు
  • హెల్త్ ఎడ్యుకేటర్ (Tఅండ్ S గ్రేడ్-D): 02 పోస్టులు
  • రిఫ్రాక్షనిస్ట్ (T అండ్ S గ్రేడ్-D): 01 పోస్టు

ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత…. అభ్యర్థులు అప్లికేషన్ ప్రింట్ ఔట్ తీసుకోవాలి. వారికి సంబంధించిన విద్యార్హతలు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలపై సంతకాలు చేసి జతపరచాలి. ఈ హార్డ్ కాపీలను వారి మైన్స్ లేదా డిపార్ట్‌మెంట్ హెడ్స్ ద్వారా కొత్తగూడెంలోని జనరల్ మేనేజర్ (పర్సనల్) EE & RC కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులు జూన్ 23వ తేదీ లోపు లేదా ఆ తేదీ నాటికి సదరు కార్యాలయానికి చేరుకోవాలి. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోరు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More