BSNL Recruitment 2026 : నెలకు రూ. 40వేల వరకు జీతంతో బీఎస్​ఎన్​ఎల్​లో ఉద్యోగాలు- నోటిఫికేషన్ వివరాలు..

BSNL recruitment 2026 : నిరుద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి అలర్ట్! నెలకు రూ. 40వేల వరకు జీతంతో జూనియర్ టెలికామ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి బీఎస్​ఎన్​ఎల్ నోటిఫికేషన్​ని జారీ చేసింది.

Published on: May 29, 2026, 05:58:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేంద్ర ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్​ఎన్​ఎల్).. నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని కల్పించింది. సంస్థలో ఖాళీగా ఉన్న జూనియర్ టెలికాం ఆఫీసర్ (జేటీఓ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 100 జేటీఓ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు బీఎస్ఎన్‌ఎల్ అధికారిక వెబ్‌సైట్ bsnl.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రభుత్వ ఉద్యోగాల అలర్ట్...
ప్రభుత్వ ఉద్యోగాల అలర్ట్...

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే టెక్నికల్ అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, వయోపరిమితి, ఎంపిక విధానం, అప్లికేషన్ ఫీజుల పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాము..

బీఎస్​ఎన్​ఎల్ జేటీఓ రిక్రూట్​మెంట్​ 2026- ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: జూన్ 4, 2026
  • దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: జూలై 3, 2026
  • అప్లికేషన్ ఎడిట్ విండో (సవరణల గడువు): జులై 4 నుంచి జులై 11, 2026 వరకు దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు.

బీఎస్​ఎన్​ఎల్ జేటీఓ రిక్రూట్​మెంట్​ 2026- వయోపరిమితి..

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు.. బీఎస్​ఎన్​ఎల్ జేటీఓ రిక్రూట్​మెంట్​ 2026 రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ (జులై 3, 2026) నాటికి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపులు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి.

బీఎస్​ఎన్​ఎల్ జేటీఓ రిక్రూట్​మెంట్​ 2026- సెలక్షన్ ప్రాసెస్..

ఈ పోస్టులకు అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ద్వారా ఎంపిక చేస్తారు.

ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ (మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు) పద్ధతిలో ఉంటుంది.

పరీక్షలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి:

సెక్షన్-1: ఇంజనీరింగ్ స్ట్రీమ్ సెక్షన్ I

సెక్షన్-2: ఇంజనీరింగ్ స్ట్రీమ్ సెక్షన్ II

సెక్షన్-3: జనరల్ ఎబిలిటీ టెస్ట్

ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ స్కోర్ ఆధారంగానే తుది ఎంపిక జాబితాను రూపొందిస్తారు.

ఈ ఉద్యోగం సంపాదించుకున్న వారికి నెలవారీ జీతం రూ. 16,400 నుంచి రూ. 40,500 వరకు ఉంటుంది. జీతంతో పాటు ఇతర అలొవెన్సులు కూడా లభిస్తాయి.

బీఎస్​ఎన్​ఎల్ జేటీఓ రిక్రూట్​మెంట్​ 2026- దరఖాస్తు రుసుము..

బీఎస్​ఎన్​ఎల్ జేటీఓ రిక్రూట్​మెంట్​ 2026 కోసం అప్లై చేస్తున్న అభ్యర్థులు తమ కేటగిరీని బట్టి ఆన్‌లైన్ విధానంలో మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది:

యూఆర్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ. 2,000/-

ఎస్​సీ / ఎస్​టీ / పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు: రూ. 1,000/-

చెల్లింపు విధానం: ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా మాత్రమే ఫీజు అంగీకరిస్తారు.

అర్హత గల అభ్యర్థులు జూన్ 4న లింక్ యాక్టివేట్ అయిన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదువుకుని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా బీఎస్​ఎన్​ఎల్ స్పష్టం చేసింది.

బీఎస్​ఎన్​ఎల్ జేటీఓ రిక్రూట్​మెంట్​ 2026 నోటిఫికేషన్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More